బాబుని వదిలి మోడీని టార్గెట్ చేసిన వర్మ

వివాదం లేనిదే రామ్ గోపాల్ వర్మ కు తెల్లారదు , పొద్దుకూకదు. ఆ వివాదం కోసం ఆయన ఎంతటివారి పైనైనా కామెంట్స్ చేస్తూంటారు. వ్యంగ్య బాణాలు ఎక్కుపెడుతూంటారు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మరోసారి సంచలనంగా మారిన వర్మ.. అవకాసం దొరికినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని, టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడాయన టార్గెట్ మారింది. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఓ వివాదాస్పద ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో మోదీని హిట్లర్‌తో పోలుస్తూ ‘సేమ్ టూ సేమ్’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో మీడియాలో ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 రెండో ప్ర‌పంచ యుద్ధానికి కార‌ణ‌మైన జ‌ర్మ‌నీ అధినేత అడాల్ఫ్ హిట్ల‌ర్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని పోల్చడంతో వర్మపై సోషల్ మీడియాలో మోడీ వర్గం విరుచుకుపడుతోంది. అప్ప‌ట్లో హిట్ల‌ర్ ఓ చిన్న‌పాప‌తో దిగిన ఫోటోని.. ప్ర‌ధాని మోడీ ఓ విదేశీ యాత్రలో చిన్నారితో తీసుకున్న ఫోటో అంటూ మరో మార్ఫింగ్ ఫోటోను పోల్చుతూ పోస్ట్ చేశారు.  

రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో హిట్లర్‌ ఫొటో అసలైనది కాదని, మార్ఫింగ్ చేసిందని, మోడీ ఫోటోను మార్ఫింగ్ చేసినట్లు నెటజన్లు గుర్తించారు. మార్ఫింగ్ చేసిన ఒరిజినల్ ఫోటోను మాజీ కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిర్వాహకురాలు దివ్య స్పందన పోస్ట్ చేశారు. దాంతో హిట్లర్, మోడీ ఇద్దరూ పిల్లల చెవులు మెలి పెట్టినట్లుగా ఉన్న ఫొటోలు ఫేక్ అని తేలంది.