రకుల్ వీడియో వైరల్..ఏముందంటే అందులో

(సూర్యం)

ఇప్పుడు వైరల్ వీడియోలదే రాజ్యం. తాము చూసిన వీడియో ఏ మాత్రం బాగుంది అనిపించినా షేర్ చేసేస్తూంటారు నెట్ జనులు. ఇక సెలబ్రెటీల విషయం అయితే చెప్పక్కర్లేదు. వాళ్ల అభిమానులే సోషల్ మీడియాలో వారి వీడియోలు ప్రమోట్ చేయటం వంటివి చేస్తూంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కు ఆ ఫెసిలిటీ ఎక్కువ. వాళ్ల గ్లామర్ ఆ పని చేయిస్తూంటుంది. ఇదిగో ఇప్పుడు రకుల్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతోంది కదా మాంచి గ్లామర్ ఉన్న వీడియో అనుకోకండి…

ఈ వీడియో రకుల్ ప్రీతి సింగ్ జిమ్ చేస్తున్నప్పటిది. తాజాగా రకుల్‌ జిమ్ లో కసరత్తులు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో ఫుల్ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో అంతలా హిట్ అవటానికి కారణం…ఆమె తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ కావటమే కాదు.ఇందులో ఆమె కష్టపడ్డ తీరు కూడా.

ఎప్పుడూ జిమ్ లో జీవితం అన్నట్లుగా కష్టపడే రకుల్ కు ఈ విషయంలో ప్రేరణ పొందేవారు చాలా మంది ఉన్నారు. వారంతా ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు తెగ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తూంటారు. అవే కదా కష్టానికి పొందే సరైన రెమ్యునేషన్ ..ఏమంటారు.

ఇంతకీ ఈ వీడియో స్పెషాలిటీ ఏమిటంటే.. నడుముకు నలభై కేజీల బరువును కట్టుకొని స్వ్కాట్ చేస్తూ చేసిన వీడియో ఇది. మెడ నొప్పిగా ఉండటంతో 40 కిలోల బరువుతో స్వ్కాట్ చేశా అంటోంది. నొప్పిలేకపోతే ఇంకెంత బరువు మోసేదో..

ప్రస్తుతం రకుల్ ఏం చేస్తోంది

రకుల్‌ ప్రీతి సింగ్ అనేక హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన ‘ఎన్జీకే’ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆయన తమ్ముడు కార్తీతో మరో సినిమా చేస్తోంది. శివ కార్తికేయన్‌ 14వ చిత్రంలోనూ కనిపిస్తోంది. ‘యన్టీఆర్‌’ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్‌ దుమ్మురేపనుంది.