Anasuya: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై హవా కొనసాగిస్తున్నారు. ఈమె బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండితెర సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ తనుకు ఏమాత్రం సమయం దొరికినా ఆ సమయాన్ని తన ఫ్యామిలీతో గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు.
తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఈమె తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అయితే వీరిద్దరూ జిమ్ లో పెద్ద ఎత్తున వర్కట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలలో అనసూయ ఎప్పటిలాగే భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేశారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా అనసూయ ఫిట్నెస్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు అంటూ ఈ ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు.
ఇక అనసూయ తరచు పొట్టి దుస్తులను ధరిస్తూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు అయితే ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు ఇలా తను ధరించే దుస్తులు పట్ల ఇదివరకే భారీ స్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ అనసూయ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతూ వచ్చారు తప్ప తనలో ఏమాత్రం మార్పు రాలేదని చెప్పాలి. ఇలా ఎన్నో సందర్భాలలో తన వస్త్రధారణ పైనే ఈమె ఏకంగా నెటిజన్లతో గొడవకు కూడా దిగిన సంగతి మనకు తెలిసిందే.