యూనిట్ సభ్యులపై కస్సు.. బస్సుమన్న రకుల్ !
ప్రతీ చిన్న విషయానికి ముక్కుమీద కోపాన్ని ప్రదర్శించడం కథానాయికలకు బాగా అలవాటైంది. షూటింగ్ సమయాల్లో యూనిట్ పై ఇది మరీ ఎక్కువైందని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఏ చిన్న పొరపాటు జరిగినా, యూనిట్ సభ్యులపై కస్సు.. బస్సుమంటూ తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారట.
ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ సినిమా షూటింగ్ లో యూనిట్ సభ్యులపై తీవ్రంగా మండిపడిందట, ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మీడియా పర్సన్ తరచూ మీ కోపానికి కారణం ఏమిటి? అని అడిగాడట. ”అబద్దాలు ఆడే వాళ్లంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది అవసరం ఉన్నా, లేకున్నా అబద్ధం ఆడేస్తారు. ఆ క్షణానికి తప్పించుకుంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటపడి పోతుంది. అప్పుడు వాళ్ళని ఎవరు నమ్ముతారు? నిజం కాస్త కఠినంగా ఉంటుంది. అయినా సరే.. నిజమే చెప్పాలి. నిజం చెప్పడం వల్ల ఆ క్షణానికి బాధ కలగొచ్చు.. కోపం రావొచ్చు. కానీఎదుటి వ్యక్తిపై ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది. బద్ధకంగా ఉండే వాళ్ళని నేను దూరం పెడుతుంటాను. అది విజేతల లక్షణంకాదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుంటే .. శరీరం కూడా చురుగ్గా ఉంటుంది” అని చెప్పు కొచ్చిందట.
ఇంతకీ అడిగిన ప్రశ్నకు, చెప్పిన సమాధానానికి ఏమైనా పొంతన కుదిరిందా? రకుల్ శరీరం చురుగ్గా ఉండడానికి కారణం యూనిట్ సభ్యులపై కస్సు.. బస్సులాడడమేనా!?