రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్‌పై ఎంతటి శ్రద్ద చూపిస్తుందో అందరికీ తెలిసిందే. నిత్యం వ్యాయామం, యోగా అంటూ బిజీగా ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు పూర్తిగా జీరో సైజ్‌లోకి రకుల్ ప్రీత్ వెళ్లిపోయింది. కరోనా సోకడంతో కాస్త ఫిట్ నెస్ తగ్గినా కూడా మళ్లీ వెంటనే తన మునుపటి రూపాన్ని తెచ్చేసుకుంది. కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్న సమయంలోనూ రకుల్ తన యోగా సెషన్ మానలేదు. మరింత సమయాన్ని యోగాకు కేటాయించింది. క్వారంటైన్‌లో తాను వేసిన ఆసనాల గురించి రకుల్ వివరించిన విషయం తెలిసిందే.
కరోనా నెగెటివ్ వచ్చింది కదా అని మనం రెగ్యులర్‌గా ఉన్నట్టు, ఇంతకు ముందు పని చేసిన విధంగా యాక్టివ్‌గా చేయలేమని రకుల్ చెప్పుకొచ్చింది. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా కొన్ని రోజులు విరామం, విశ్రాంతి తీసుకోవాలని తెలిపింది. అదే విషయం తనకు సెట్‌లో అడుగుపెట్టిన తరువాతే అర్థమైందని చెప్పుకొచ్చింది. అందుకే తాను ఇంకా మరింత శక్తివంతంగా తయారవ్వడానికి వ్యాయామం, యోగం, మంచి ఆహారం తీసుకున్నానని చెప్పుకొచ్చింది.
అలా రకుల్ మళ్లీ వెంటనే తన యథారూపానికి వచ్చింది. ఇప్పుడు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. రకుల్ క్షణం తీరిక లేకుండా షూటింగ్‌లతో బిజీగా ఉంది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్నింట్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా రకుల్ ఓ ఆసనం వేసింది. అందులో చేతులను రివర్స్ చేసి దండం పెట్టింది. మనం ఎంతగా మలిచితే.. అంత స్వేచ్చగా ఫీల్ అవుతామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ పెట్టిన ఆ దండం చూసి అందరూ షాక్ అవుతున్నారు.