Rakul Preet : భారీ ఓటిటి డీల్ తో రకుల్ సైకో థ్రిల్లర్ సినిమా..రేటు ఎంతంటే.!

Rakul Preet :  సౌత్ ఇండియా సినిమా దగ్గర ఓ చిన్న సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది అంటే అది ఇతర భాషల్లో రీమేక్ అయ్యి తీరాల్సిందే. అలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో రీమేక్ స్టార్ ఉన్నాడు. అలా మన తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు ఉండగా హిందీలో వస్తే స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నాడు.
తన కెరీర్ లోనే చాలా వరకు అన్నీ రీమేక్ సినిమాలు లేకపోయే రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ పైనే సినిమాలు వస్తాయి. అయితే అలా ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన మరో క్రేజీ రీమేక్ సినిమా “మిషన్ సిండ్రెల్లా”. తమిళంలో భారీ హిట్ అయ్యిన “రాట్సాసన్” కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.
దీనిని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ లు నటించారు. ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ సైకో మరియు క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాని హిందీలో వారు చేశారు. అయితే నిజానికి ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారట.
దీనికి గాను భారీ ఆఫర్ ని హాట్ స్టార్ వారు ఇచ్చారు అట. సినీ వర్గాల్లో సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి 130 కోట్లకి పైగా ఆఫర్ ఇచ్చారట. డిజిటల్ మరియు శాటిలైట్ కి కలిపి డీల్ క్లోజ్ చేశారట. అలాగే ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి హిందీలో ఈ సినిమాని ఎలా తీశారో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగాల్సిందే.