వయసైపోయిన హీరోలతో రొమాన్స్ ఏంటి అంటున్నారు.. రకుల్

అందాలతార రకుల్‌ప్రీత్ సింగ్ ఈమధ్య తెగ రెచ్చిపోతోంది. ఏ సినిమానైనా ఒప్పుకునేముందు కధ ఏంటి? నా పాత్ర ఎలాంటిది? వైవిధ్యమైన పాత్రలతో వచ్చే తృప్తి వీటి గురించే ఆలోచిస్తాను అంటోంది ఈ అందాల భామ.

వయసైపోయిన హీరోలతో రొమాన్స్ పాత్రలేంటి? అంటూ చుట్టూ ప్రపంచం కామెంట్లూ చేస్తోంది. వాటికి భయపడి నాకు నచ్చిన పాత్రల్ని వదులుకోను అని చెప్పిందే చెబుతుంది. సీనియర్ హీరో నాగ్‌కు జోడీగా రకుల్ చేసిన తాజా ప్రాజెక్టు -మన్మథుడు 2. ఓ ఫ్రెంచ్ మూవీలోని సెంట్రల్ పాయింట్‌తో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన సినిమా ఆగస్టు 9న థియేటర్లకు వస్తోంది.

ఆ ప్రమోషన్లలో బిజీగావున్న రకుల్ మన్మథుడు-2 కోసం తెగ హడావుడి చేస్తోంది. లేడీ ఓరియంటెడ్ అంటూ ప్రత్యేకంగా ఉంటుందని అనుకోను. కమర్షియల్ చిత్రాల్లో ముఖ్యమైన పాత్ర సైతం లేడీ ఓరియంటెడ్ అని ఎందుకు అనుకోకూడదు. అఫ్‌కోర్స్.. అందరూ అనుకున్నట్టు అలాంటి మంచి కథలొస్తే చేయడానికి నేను రెడీనే అని అంటోంది. మన్మథుడు 2లో అవంతిక ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఎంత ఫన్‌గా కనిపిస్తుందో అంత మెచ్యూర్డ్ గాళ్. చూడ్డానికి నాటీగా అనిపించినా, పాత్ర లోతుల్లోని స్వరూపం వేరు. చాలా సినిమాల్లో చాలా పాత్రలే చేసేశాను. వాటిల్లో ‘అవంతిక’ ప్రత్యేకం. కరెక్ట్ టైంలో ఈ క్యారెక్టర్ చేశాననిపిస్తోంది. రెండు గ్లామర్డ్ సాంగ్స్, నాలుగు సీన్స్‌కు పరిమితమయ్యే పాత్ర కాదు. నాగ్ పోషించిన శామ్ పాత్రతో సమానమైన ప్రాధాన్యత ఉంది. రెండు పాత్రల మీదా రెండు టీజర్లు కట్ చేసింది అందుకే.

పెద్ద హీరోలతో చేశాక, చిన్న హీరోల ప్రాజెక్టుల్లో అవకాశాలు రావన్నది ఓ పిచ్చి భయం. తెలుగులో తరువాతి ప్రాజెక్టు నితిన్‌తో చేస్తున్నా. అంటే నాకు వచ్చినట్టేగా. నావరకూ నేను కధకే ప్రాముఖ్యతను ఇస్తా అని ఘంటాపథంగా చెప్పుకొచ్చింది. అబ్బో.. రకుల్‌ప్రీత్ సింగ్ బాగానే నేర్చేసుకుంది!