Rakul Preeth Singh: మా పెళ్లిలో నో ఫోన్ పాలసీ పెట్టడానికి కారణం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్‌ సింగ్‌?

Rakul Preeth Singh: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అలాగే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది ఫిబ్రవరిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. జాకీ భగ్నాని అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లి వేడుక గోవాలోని ఒక రిసార్ట్ లో సన్నిహితులు, బంధువులు స్నేహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే రకుల్ పెళ్ళికి హాజరైన వారికీ మొబైల్ ఫోన్ ఎంట్రీ లేదు.

దీంతో రకుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చాలా తక్కువగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ తాను అంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటో వివరించింది. తన పెళ్లిని సింపుల్‌ గా ఎందుకు చేసుకున్నారో తాజాగా వివరించారు. పెళ్లిలో నో ఫోన్‌ పాలసీ పెట్డడానికి కారణం కూడా తెలిపారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. మా పెళ్లిని చాలా సింపుల్‌ గా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాము. లగ్జరీ కంటే సౌకర్యం ముఖ్యం. పెళ్లి జరిగిన విలువైన క్షణాలను ఎంజాయ్‌ చేశాం.

సింపుల్‌ గా పెళ్లి చేసుకోవడంలో ఒకరకమైన ఆనందం ఉంటుంది. వివాహం జరిగిన మూడు రోజులు మా జీవితంలో బెస్ట్‌ గా ఉండాలనుకున్నాను. వివాహానికి వచ్చిన అతిథులు కూడా ఈ వేడుకను సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నాము. అందుకే నో ఫోన్‌ పాలసీ పెట్టాము. అంతేకానీ, వాళ్లు మా పెళ్లి ఫొటోలు లీక్‌ చేస్తారని కాదు. ఈ వేడుక చిత్రాలను మేమే మొదట పంచుకోవాలని నిర్ణయించుకున్నాం. పెళ్లిలోని ప్రతి మూమెంట్‌ ను డ్యాన్స్‌ తో సెలబ్రేట్‌ చేసుకున్నాము. పెళ్లి దుస్తుల్లో కూడా డ్యాన్స్‌ వేశాం అని రకుల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.