Rakul: ఆ బట్టలు వేసుకోవాలంటే లక్షలు ఖర్చు చేయాలి… నటి రకుల్ షాకింగ్ కామెంట్స్!

Rakul: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి రకుల్ ప్రీతిసింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న రకుల్ ఇటీవల సౌత్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు.

ఇక ఈమె తెలుగులో కొండ పొలం అనే సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఈమె స్టార్ హీరోలందరి సరసన నటించిన ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన రకుల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి మాట్లాడారు.

సాధారణంగా హీరోలు లేదా హీరోయిన్ లక్షలు ఖరీదు చేస్తూ విలువైన వస్తువులను డ్రస్సులను కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ మేము ఇంత అందంగా కనిపిస్తున్నాము అంటే అందం వెనుక ఎంతో మంది కష్టం ఉంటుందని తెలిపారు . మాకు ఒక డ్రెస్ డిజైన్ చేస్తే అందుకు అనుకూలంగా హెయిర్ స్టైల్ మేకప్ అని కూడా వేయాల్సి ఉంటుంది అలా మాతో ఒక టీం మూవ్ అవుతూ ఉంటుంది గత ఆరు సంవత్సరాలుగా నాతో ఒక టీం ఉందని వీరందరూ నా కుటుంబ సభ్యులతో సమానం అని రకుల్ తెలిపారు.

ఇకపోతే అంతర్జాతీయ వేదికలపై ఏదైనా ఈ వెంట్లలో కనిపించినప్పుడు రెడ్ కార్పెట్ కోసం ఎంతోమంది డిజైనర్స్ మాకు ఉచితంగా డ్రస్సులను పంపిస్తుంటారు అయితే ఆ డ్రెస్సులు మాకు ఉచితంగా వచ్చినప్పటికీ వాటిని వేసుకోవాలి అంటే మేము లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని రకుల్ తెలిపారు.వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చిన వారికి ఆ డ్రెస్‌కు తగిన విధంగా మమ్మల్ని అందంగా రెడీ చేసే స్టైలిష్ట్ లకు డబ్బులు ఇవ్వాలి. వారి డ్రెస్ తగ్గ లుక్ కోసం 20,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటారు. అంతేకాదు కొరియర్ ఛార్జీలు సైతం అందులోనే ఛార్జ్ చేస్తారనీ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.