కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ ఆశలు పెట్టుకున్న భారీ పాన్ ఇండియన్ సినిమా ఏమైందో ..?

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాలో జాయిన్ కాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాం చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హనీమూన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన కాజల్ షూటింగ్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతుందట. ముందుగా ఆచార్య సెట్ లోనే అడుగు పెట్టబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ – కాజల్ కలిసి ఖైదీ నంబర్ 150 లో నటించి ఉండటం తో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమా తర్వాత తలపతి విజయ్ – ఏ ఆర్ మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న తుపాకి సీక్వెల్ తుపాకి 2 లో నటించబోతుందని సమాచారం. రాశీఖన్నా మరో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ చేసింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే నితిన్ నటిస్తున్న చెక్ అన్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది రకుల్. చంద్ర శేఖర్ యేలేటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

కాగా కాజల్ అగర్వాల్ – రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారని గత కొన్ని నెలలుగా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఈ పాన్ ఇండియన్ సినిమానే ఇండియన్ 2. లోకనాయకుడు కమల్ హాసన్ – శంకర్ ల కాంబినేషన్ లో ఈ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కాగా అనేక కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా ఇక లేనట్టే అనుకున్నారు.

అందుకు కారణం దర్శకుడికి – నిర్మాతకి మధ్య విభేదాలు..తలెత్తడమే. దాంతో భారీ సినిమాలో నటించబోతున్నామన్న కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ ల ఆశలన్ని గల్లంతే అనుకున్నారు. కాని లేటెస్ట్ అప్‌డేట్ ని బట్టి ఇండియన్ 2 జనవరి నుంచి మొదలబోతుందట. అంతేకాదు శంకర్ ఈ సినిమాని కంటిన్యూ షెడ్యూల్స్ తో శరవేగంగా కంప్లీట్ చేయబోతున్నాడని సమాచారం. దాంతో కాజల్, రకుల్ మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారట.