రజనీ ఆరోగ్యం పై…అఫీషియల్ ప్రకటన

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్ ను ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఆయన అనారోగ్యానికి గురయ్యారని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని, ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారంటూ సోషల్ మీడియాలో శుక్రవారం ప్రచారం మొదలైంది. దీనిపై రజనీకాంత్‌ మేనజర్, పబ్లిషిస్ట్ …మరియు సన్నిహిత వర్గాలు స్పందిస్తూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశాయి. రూమర్స్ ను నమ్మవద్దని కోరాయి.

రజనీ నటించిన ‘2.ఓ’ సినిమా నవంబరు 29న విడుదలకు సిద్ధమౌతోంది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు.

అలాగే రజనీ నటించిన ‘పేట’ సినిమా ఆడియోను డిసెంబరు 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, సిమ్రన్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్‌ పిక్చర్స్‌ సినిమాను నిర్మిస్తోంది. దీని తర్వాత తలైవా-ఎ.ఆర్‌. మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు సమాచారం.