ఫొటో లీక్ ,అదేం పనంటూ రజనీ ని తిట్టిపోస్తున్నారు

రీసెంట్ గా సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం 2.0 ని జనంతో పాటే కూర్చుని చూసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు బయిటకు వచ్చాయి. కానీ ఆ ఫొటోలో ఓ అంశం ఇప్పుడు ఆయన్ని విమర్శలు పాలు చేస్తోంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే రజనీ ఫ్యామిలీ అంతా కూర్చుని సినిమా చూస్తున్నారు.

వారి వెనక వారి పని అమ్మాయి నిలబడి సినిమా చూస్తోంది. ఇది చూసిన చాలా మంది ఆమెను కూర్చోమని అనలేకపోయారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. భారి ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది. అయితే ఆమె పనిమనిషి కాదు..వారితో ఫొటో దిగిన అమ్మాయి అని రజనీ అభిమానలు కొట్టిపారేస్తున్నారు.

ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’. రజనీకాంత్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెన్నైలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లు ఇప్పటికీ హౌస్ ఫుల్స్ తో కిక్కిరిసిపోతున్నాయి.

ఈక్రమంలో రెండు రోజుల క్రితం రజనీకాంత్‌.. చెన్నై లోని సత్యం థియేటర్‌లో ‘2.O’ సినిమాను చూశారు. కుటుంబసభ్యులతో కలిసి ‘సత్యం సినిమాస్‌’కి విచ్చేసిన రజనీని చూసి ఫ్యాన్స్‌ హంగామా సృష్టించారు. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. వారిని కంట్రోలు చేయటం చాలా కష్టమైందని తెలుస్తోంది.