కుమ్మేసాడు :రాజశేఖర్ ‘కల్కి’కమర్షియల్ ట్రైలర్

‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌ ఇప్పుడు మరో చిత్రం చేస్తున్నారు. నాని నిర్మించిన అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్నాడు. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి కమర్షియల్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ కమర్షియల్‌ ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా హీరో నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో రాజశేఖర్‌ ఫుల్‌ జోష్‌ ఉన్నారు.

KALKI Commercial Trailer With Honest English Subtitles | Dr. Rajashekar | A Prasanth Varma Film

ట్రైలర్‌ ప్రారంభంలో వచ్చే.. గీతాప్రభోదం.. ఆ తర్వాత రాజశేఖర్ తన రెగ్యులర్ మ్యానరిజంలో చెప్పే డైలాగ్‌.. చివర్లో ఆయన స్టైల్‌ డ్యాన్స్‌పై తనే ఫైర్‌ అవ్వడం.. ఈ ట్రైలర్‌లో హైలెట్‌ గా ఉన్నాయి. చూస్తూంటే రాజశేఖర్ కు మరో హిట్‌ గ్యారెంటీ అనిపిస్తోంది. ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

దశావతారాల్లో ‘కల్కి’ 10వ అవతారం కావడం వల్లనే ఈ ముహూర్తాన్ని సెట్ చేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొనడం విశేషం. రాజశేఖర్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు.