Devara: దేవర : హిందీలో హిట్‌.. మిగతా చోట్ల లైట్‌!

Devara: టాలీవుడ్‌ నుంచి ‘కల్కి’ తర్వాత అత్యధిక అంచనాలతో విడుదలైన పాన్‌ ఇండియా సినిమా ‘దేవర‘. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించింది. టాక్‌ కొంచెం అటు ఇటుగా ఉన్నా.. ఈ చిత్రం ఓపెనింగ్‌ వీకెండ్లో భారీ వసూళ్లే సాధించింది. ఆ తర్వాత కొంచెం డల్‌ అయినట్లు కనిపించినా.. దసరా సెలవులను ఉపయోగించుకుని నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. ఇంకా కూడా ఈ సినిమా రన్‌ కొనసాగుతోంది. కాకపోతే ప్రస్తుతం వసూళ్లు నామమాత్రంగా ఉన్నాయి.

ఐతే పేరుకు పాన్‌ ఇండియా సినిమా కానీ ‘దేవర‘ మేజర్‌ వసూళ్లను తెలుగు వెర్షన్‌ నుంచే రాబట్టింది. 80 శాతం పైగా వసూళ్లు తెలుగు నుంచి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్‌లో, కర్ణాటకలో తెలుగు వెర్షన్‌ అదరగొట్టింది. కానీ సౌత్‌లో మిగతా చోట్ల ‘దేవర‘ పెద్దగా ప్రభావం చూపలేదు. తమిళ జనాలు ‘దేవర’ను అంతగా పట్టించుకోలేదు. అక్కడ వసూళ్లు నామమాత్రం. మలయాళంలోనూ పరిస్థితి అంతంతమాత్రమే.

Devara Movie Review: ‘దేవర’ మూవీ ఎలా ఉందటే…

దేవర‘ తెలుగులో కాకుండా ప్రభావం చూపింది హిందీలో మాత్రమే. అక్కడ ఈ సినిమా హిట్‌ రేంజిని అందుకుంది. పెద్దగా బజ్‌ లేకుండా రిలీజైన ‘దేవర‘ హిందీ వెర్షన్‌కు మాస్‌ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. తొలి వీకెండ్లో రూ.25 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది ‘దేవర‘. ఆ ఊపు చూస్తే వంద కోట్ల మార్కును కూడా అందుకుంటుందా? అనే చర్చ నడిచింది. కానీ ‘దేవర‘ ప్రస్తుతానికి హిందీలో రూ.65 కోట్లే కలెక్ట్‌ చేయగలిగింది. కానీ ఇది కూడా చిన్న నంబరేమీ కాదు.

విడుదలకు ముందు ‘దేవర’కు నార్త్‌ ఇండియాలో బజ్‌ కనిపించలేదు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ నామమాత్రంగా కనిపించాయి. కానీ తొలి రోజు నుంచి సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బలంగానే నిలబడింది. యావరేజ్‌ కంటెంట్‌ ఉన్న సినిమాతో ఈ వసూళ్లు సాధించడం విశేషమే. తెలుగులో దేవర చాలా చోట్ల బయ్యర్లకు లాభాలు అందించింది. కొన్ని ఏరియాల్లో జస్ట్‌ బ్రేక్‌ ఈవెన్‌ అయింది. ఓవరాల్‌గా ‘దేవర’కు సంతృప్తికర ఫలితం వచ్చినట్లే…!

Analyst Dasari Vignan Reveals Truth Behind Muthyalamma Temple Idol Allegedly Vandalized || TR