ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 2.o. లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ రోజున (నవంబర్ 29న) విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియల్ షోలు యుఎస్ లో పడ్డాయి.ఈ చిత్రం సెకండాఫ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.
సెకండాఫ్ లో అక్షయ్ ..పక్షి రాజుగా సెల్ ఫోన్ టవర్స్ ని , మొబైల్ యూసేజ్ ని వాడటం ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ అదృష్టం ఉండదు. సెల్ ఫోన్స్ నుంచి రేడియోషన్ నుంచి పక్షుల మరణాన్ని ఆపాలనుకుంటాడు. ఆ క్రమంలో అతను ఆత్మహత్యచేసుకుంటాడు. దాంతో ఇప్పుడు అక్షయ్ పక్షి గా సెల్ ఫోన్స్ వాడే జనాలపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇప్పుడు చిట్టీ వెర్షన్ పక్షి గా కథ టర్న్ తీసుకుంటుంది. చిట్టి తన పనికి అడ్డుపడుతోందని ..ఆ చిట్టీని డిజైన్ చేసిన వశీ పై ఎటాక్స్ మొదలెడతాడు అక్షయ్. అక్కడ నుంచి వంశీని పక్షిరాజు అక్షయ్ నుంచి కాపాడుకున్నాడనేది మిగతా కథ.
ఈ సినిమా సెకండాఫ్ ..2.0 ఫస్ట్ పార్ట్ అంత గొప్పగా లేదు. సెంటిమెంట్ సీన్స్ ,సోల్ ఛేంజ్ వంటివి కొద్ది గా అతిగా అనిపిస్తాయి. అలాగే ఫస్టాఫ్ లో ట్విస్ట్ తెలిసిపోవటంతో సెకండాఫ్ లో సస్పెన్స్ లేదు. కామెడీ చాలా లిమిటెడ్ గా ఉంది.
అయితే క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఎక్ట్రార్డనరీగా ఉంది. హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్ తో దుమ్ము రేపాడు. 3డి వర్క్, విఎప్ ఎక్స్ ఎఫెక్ట్స్ టాప్ గా ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది.