ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 2.o. లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ రోజున (నవంబర్ 29న) విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియల్ షోలు యుఎస్ లో పడ్డాయి.
సినిమా ప్రారంభమే ఓ వ్యక్తి సెల్ టవర్ మీద నుంచి సూసైడ్ చేసుకోవటంతో మొదలవుతుంది. ఎవరనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయరు. అక్షయ్ కుమార్ అని మనకు అర్దమవుతుంది. ఆ తర్వాత సైంటిస్ట్ వశీకరణ్ ఇంట్రడక్షన్..ఆయన అసెస్టెంట్ వెన్నెల ని పరిచయం చేస్తారు. తర్వాత సెల్ ఫోన్స్ మాయమవుతూంటాయి. గవర్నమెంట్ ..వసీకరణ్ సాయిం అడుగుతుంది. మిలటరీని రంగంలోకి దింపుదామనుకుంటారు. కానీ వసీకరణ్ తానుచిట్టిని రంగంలోకి దింపుతానని చెప్పటంతో కథ లో మొదటి మలపు వస్తుంది. అక్కడ నుంచి కథ పరుగెడుతుంది. ఇంటర్వెల్ కు అక్షయ్ ..పక్షి రూపంలో కనపడతారు.
ఈ సినిమా ఫస్టాఫ్ ..రోబో ఫస్ట్ పార్ట్ అంత ఫన్ లేదు. అయితే సినిమా ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. పూర్తిగా స్క్రిప్టు నేరేటివ్ గా సాగిపోయింది. ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కథను ప్రక్కన పెట్టలేదు. మొదట ఫ్రేమ్ నుంచే శంకర్ కథలోకి తీసుకెళ్లిపోయారు. గ్రాండియర్ విజువల్స్ తో సస్సెన్స్ ఫాక్టర్ తో ప్రేక్షకుడు పూర్తిగా లీనమైపోతాడు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర పక్షి (అక్షయ్ కుమార్) రావటంతో పూర్తి ఇంట్రస్ట్ మొదలవుతుంది. చిత్రంగా సాంగ్స్ అనేవి లేవు. ఓవరాల్ గా ఫస్టాఫ్ బాగుంది. విజువల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. విఎఫ్ ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.