జాతీయ అవార్డ్ సినిమాలో రాజ్ త‌రుణ్‌?

రాజ్ త‌రుణ్ రొట్టె నెయ్యిలో?

బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన `విక్కీడోన‌ర్` చిత్రాన్ని తెలుగులో సుమంత్ హీరోగా `న‌రుడ డోన‌రుడా` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు రీమేక్ కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్ర‌స్తుతం ఆయుష్మాన్ న‌టించిన `అంధాదున్` చిత్రాన్ని నాని హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విక్కీడోన‌ర్, అంధాదున్ రెండు చిత్రాల‌కు జాతీయ అవార్డులు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఆయుష్మాన్ న‌ట‌న‌కు గుర్తింపు ద‌క్కింది. అంధాదున్ చిత్రంలో న‌ట‌న‌కు ఆయుష్మాన్ కి ఉత్త‌మ న‌టుడు అవార్డు ద‌క్కింది.

<

p style=”text-align: justify”>ప్ర‌స్తుతం ఆయుష్మాన్ న‌టిస్తున్న తాజా చిత్రం డ్రీమ్ గ‌ర్ల్ సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఇప్ప‌టికే ఈ సినిమా హ‌క్కుల్ని చేజిక్కించుకుని రీమేక్ కోసం ప‌ని ప్రారంభించారు. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. పూర్తి ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా అల‌రించ‌నుంద‌ని డ్రీమ్ గ‌ర్ల్ ట్రైల‌ర్ చెబుతోంది. డ్రీమ్ గ‌ర్ల్ మ‌రో జాతీయ అవార్డు సినిమా కానుందా? అంత‌టి క్రేజీ చిత్రం రీమేక్ లో రాజ్ త‌రుణ్ కి ఛాన్స్ దక్కిందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.