రాజ్ తరుణ్‌తో అరియానా.. అది వర్కవుట్ అయ్యేనా?

Ariyana Raj Tarun Movie Opening

బిగ్ బాస్ షో ద్వారా బాగా బాగుపడుతున్న కంటెస్టెంట్లలో నాల్గో సీజన్ సభ్యులే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. కరోనా లాక్డౌన్ పుణ్యమా? అనో ఏమో గానీ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు చాలా మంది కంట్లో పడ్డారు. ఇండస్ట్రీలో దర్శకనిర్మాత కంట్లో చాలా మంది బిగ్ బాస్ బ్యూటీలు పడ్డారు. అందులో దివి, మోనాల్, హారిక, అరియానా వంటి వారెంతో మంది ఉన్నారు. ఇందులో దివికి ఇప్పటికే అదిరిపోయే ఆఫర్లు వచ్చాయి. ఏకంగా మెగాస్టార్ ప్రాజెక్ట్‌లోనే చాన్స్ కొట్టేసింది.

Ariyana Raj Tarun Movie Opening

వేదాళం రీమేక్‌లో దివి ఓ కీ రోల్ పోషిస్తోంది. మోనాల్ కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది. డ్యాన్స్ ప్లస్ షో, ఐటెం సాంగ్స్, హీరోయిన్‌గానూ ఆఫర్లు వచ్చేస్తున్నాయి. హారిక సైతం స్క్రిప్ట్‌లు వింటోందట. అయితే తాజాగా అరియానా అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాజ్ తరుణ్‌తో కలిసి అరియానా నటించబోతోంది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా అరియానా గాల్లో తేలిపోతోంది.

ఈ మేరకు అరియానా మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. అదిరిపోయే వార్త రాబోతోంది.. బిగ్ బాస్ తరువాత నా జీవితంలోనే గొప్ప రోజు ఇది.. దర్శకుడు శ్రీనుకి థ్యాంక్స్.. రాజ్ తరుణ్ నువ్ నిజంగా అద్భుతానివి అంటూ ప్రశంసలు కురిపించింది. అంతా బాగానే ఉంది గానీ.. వెండితెరపై అరియానా మ్యాజిక్ చూపిస్తుందా? అన్నదే ప్రశ్నార్థకమే. అసలు రాజ్ తరుణ్ ఇప్పుడు ఫాం కోల్పోయి కష్టాల్లో ఉన్నాడు. మరి అరియానా సంగతి ఏమవుతుందో చూడాలి.