నాగార్జున ఇక జీవితంలో వర్మ ని నమ్మడేమో ..?

నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులను తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేశాడు. ఒక్క దర్శకులనే కాదు రాజ్ తరుణ్ లాంటి హీరోలను.. హీరోయిన్స్ ని అమ్మ రాజ శేఖర్, లారెన్స్ రాఘవ లాంటి వాళ్ళకీ నాగార్జున అవకాశం కల్పించి ఈ రోజు స్టార్స్ గా మార్చాడు. అంతేకాదు అన్నపూర్ణ బ్యానర్ నుంచి పరిచయం అయిన ఎవరైనా కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకుంటారన్న బలమైన సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే ఇండస్ట్రీకొచ్చే వాళ్ళు ఎవరైనా ముందు నాగార్జున ముందు వాలిపోతారు.

Telangana eyes Annapurna studio land

ఇక నాగార్జున అవకాశం ఇవ్వడం వల్ల టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ స్టార్ డైరెక్టర్ గా సంచలన దర్శకుడిగా మారాడు రాం గోపాల్ వర్మ. అంతేకాదు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో రాం గోపాల్ వర్మ చేసిన ప్రయోగాలు సంచలనం అయ్యాయి. ఇక రాం గోపాల్ వర్మ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులని.. హీరోలని, ఇతర టెక్నీషియన్స్ ని పరిచయం చేసి లైఫ్ ఇచ్చాడు. అన్నపూర్ణ బ్యానర్ లోనే రాం గోపాల్ వర్మ సుమంత్ ని హీరోగానూ పరిచయం చేశాడు.

Nagarjuna's Officer Is Copy Of This Hollywood Movie

నాగార్జున – రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన శివ సినిమా ఇద్దరి కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపొయే సినిమా. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికే శివ సినిమా లాంటి ఇండస్ట్రీ హిట్ మరొకటి రాలేదు. ఆ కారణంగానే నాగార్జున వర్మ తో మళ్ళీ ఆఫీసర్ అన్న సినిమా చేశాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పుడు అందరూ శివ కంటే భారీ హిట్ అవుతుందని భావించారు. అంతేకాదు వర్మ చెప్పిన మాటలకి నాగార్జున కూడా బ్లైండ్ గా నమ్మాడు. అందుకే ఆఫీసర్ వచ్చింది. కానీ నాగార్జున నే కాదు ప్రేక్షకులను.. ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద షాకిచ్చింది. ఇప్పటికీ నాగార్జున కి ఈ సినిమా రిజల్ట్ మైండ్ లో అలానే ఉండిపోయింది. అందుకే మళ్ళీ నాగార్జున వర్మ తో సినిమా చేయడేమొ అని చెప్పుకుంటున్నారు.