భీమవరంలో అరియానా సందడి.. అలా తయారై రచ్చ

Ariyana In Bhimavaram About Raj Tarun Movie

అరియానా ప్రస్తుతం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతితెలిసిందే. బిగ్ బాస్ షో తరువాత బయటకు వచ్చిన లేడీ కంటెస్టెంట్లలో సోలో హీరోయిన్‌గా సినిమా మొదలుపెట్టిన అమ్మాయిగా అరియానా నిలిచింది. దివికి ఎక్కువ పేరు వచ్చినా కూడా ఇంత వరకు హీరోయిన్‌గా ఒక్క ప్రాజెక్ట్ కూడా బయటకు ప్రకటించలేదు. మోనాల్ ఐటెం సాంగ్‌తో రచ్చ చేసింది. కానీ హీరోయిన్‌గా ఇంత వరకు ఒక్క ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పలేదు.

Ariyana In Bhimavaram About Raj Tarun Movie
Ariyana In Bhimavaram About Raj Tarun Movie

అలా అరియానా మాత్రం హీరోయిన్‌గా ఓ సినిమా ప్రకటించేసింది. చకచకా షూటింగ్ కూడా జరిగిపోతోంది. అలా మొత్తంగా అరియానా ఇప్పుడు తన సత్తాను చాటుతోంది. రాజ్ తరుణ్‌తొ ఆ మధ్య అరియానా సినిమా ఓపెనింగ్ గురించి చెబుతూ పోస్ట్ చేసింది. బిగ్ బాస్ తరువాత మళ్లీ ఇదే తన జీవితంలో గుర్తుండి పోయే రోజంటూ అరియానా ఎమోషనల్ అయింది. అయితే తాజాగా అరియానా మరో పోస్ట్ చేసింది.

అరియానా ప్రస్తుతం భీమవరంలో ఉంది. అక్కడే గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది. అరియానా, రాజ్ తరుణ్‌ల మీద కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. వీటికి సంబంధించి తాజాగా ఓ పోస్ట్ చేసింది అరియానా. మనమేంటో మనం మాట్లాడకపోయినా మన స్టైల్ చెబుతుంది.. నన్ను ఈ సినిమాలో ఇంత బాగా చూపిస్తున్నందుకు దర్శకుడికి థ్యాంక్స్ అంటూఅరియానా గాల్లో తేలిపోయింది.