నాగ్ సెటెైర్ కు డైరక్టర్ కు నోట మాట రాలేదట

నటుడు రాహుల్ రవీంద్రన్ ఆ మధ్యన దర్శకుడుగా మారి ‘చిలసౌ’ టైటిల్ తో ఓ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.సుశాంత్, రుహాణి శర్మ జంటగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద పే చెయ్యకపోయినా… రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం టాలెంట్ ని వెలికి తీసింది. ఈ నేఫధ్యంలో అతని నేరేటివ్ స్కిల్స్ ని మెచ్చుకున్న నాగార్జున మన బ్యానర్ లో ఓ సినిమా చేద్దాం..కథ చేసుకోమని ఆఫర్ ఇచ్చారు. రాహుల్ రవింద్రన్ తన టీమ్ తో కలిసి రాత్రింబవళ్లూ కష్టపడి ఓ పూర్తి స్క్రిప్టుని రెడీ చేసి నాగార్జునని రీసెంట్ గా కలిసి వినిపించారు. అయితే అది అఖిల్ కోసం అనుకుని రెడీ చేసిన కథ.

వెంటనే నాగార్జున ..నేను కథ తయారు చేయమన్నది నా కోసంకానీ మా అబ్బాయి కోసం కాదు. సారీ అని చెప్పేసాడుట. దాంతో రాహుల్ రవీంద్ర కొద్దిగా డిజప్పాయింట్ అయ్యినా వెంటనే తేరుకుని కొద్ది రోజుల్లోనే ఓ స్క్రిప్టుతో కలుస్తాను అని చెప్పారట. కానీ ఆ కథ మన్మధుడులా ఉండటంతో …తాను ఇక అలాంటి కథలు చెయ్యదలుచుకోలేదని, నువ్వు తెచ్చే కథలు మా పిల్లలకు పనికి వస్తాయి కానీ నాకు కాదు.

నన్ను దృష్టిలో పెట్టుకుని కథ చేసుకో…లేదా పూర్తిగా మా పిల్లల కోసమే అనుకుంటే వాళ్లతో ఓకే చేయించుకో. ఆ తర్వాత నాకు కథ వినిపించు..వాళ్లకు నచ్చాక. అంతేకానీ నా కథలు వాళ్లకు, వాళ్ల కథలు నాకు చెప్పకు అని చెప్పారట. దాంతో రాహుల్ రవీంద్రన్ సరే అని ఇప్పుడు ఎవరికి కథ చెయ్యాలా అనే డైలమోలో పడ్డాడుట. అదీ విషయం.