నయనతారను నోటికొచ్చినట్లు వాగాడు, అందరూ తిట్లు

అందరూ చూస్తూండగానే స్టేజీపై నోటికొచ్చి మాట్లాడి తమిళనటుడు రాధారవి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రముఖ తమిళ నటుడు రాధారవి స్టార్ హీరోయిన్ నయనతారపై రీసెంట్ గా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నయనతారను తక్కువ చేస్తూ ఆయన మాట్లాడిన తీరు తమిళనాటలో హాట్‌టాపిక్‌ అయ్యింది.

బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సీనియర్‌ నటుడు ఇలా ప్రవర్తించడం పట్ల ఇప్పటికే ఆయన సోదరి రాధిక, నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, గాయని చిన్మయి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ‘అరం’, ‘విశ్వాసం’, ‘ఐరా’ తదితర చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్‌ స్టూడియోస్‌ రాధారవిపై కఠినమైన చర్యలు తీసుకుంది. ఇకపై ఆయన్ను తమ సినిమాలకు తీసుకోమని ప్రకటించింది.

‘రాధారవి వ్యాఖ్యల్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన్ను ఇక మా సినిమాల్లోకి తీసుకోం. ఆయనతో కలిసి పనిచేయొద్దని చిత్ర పరిశ్రమలోని మాతోటి సంస్థలకు, స్నేహితులకు కూడా సలహా ఇస్తున్నాం’ అని ట్వీట్‌ చేసింది. దీంతోపాటు ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇంతకీ రాధారవి ఏమన్నారు..

ఈ కార్యక్రమానికి హాజరైన రాధారవి మాట్లాడుతూ– ‘‘నయనతార మంచి నటే. నేనొప్పుకుంటాను. ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా టాప్‌లోనే కొనసాగుతున్నారు. తమిళ ప్రజలు ఏ విషయాన్నయినా నాలుగైదు రోజుల్లో మరచిపోతారు. తను ప్రస్తుతం ఫేమస్‌ కావచ్చు. తనే సీత పాత్ర చేస్తోంది, దెయ్యం పాత్రలూ చేస్తోంది.

ఇంతకుముందు దేవుళ్ల పాత్రలో నటించాలంటే కేఆర్‌ విజయగారి వద్దకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు? ఎవరైనా చేయొచ్చు. గౌరవప్రదమైన వాళ్లనైనా నటింపజేయొచ్చు, ఎవరెవరితో తిరిగేవాళ్లనైనా నటింపజేయొచ్చు. ఈ మధ్య హారర్‌ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు నయనతార. తనని మామూలుగా చూస్తే దెయ్యాలే పారిపోతాయి’’ అని నయనతారపై కామెంట్‌ చేశారు.