డైరక్ట్ గా ‘ఫక్’ అనేసిందే,కుర్రాడు కంగారు

అవును …కాస్త విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న కుర్రాళ్లు లేదా సిటిలో ఉన్నా కాస్తంత అమాయికత్వపు లుక్ తో కనపడే కుర్రాళ్లు..స్పీడుగా దూసుకుపోయే అమ్మాయితో ప్రేమలో పడితే పరిస్దితి ఏమిటి..వాళ్లు అసలు వీళ్లను లెక్క చేస్తారా… చేస్తారు..కాకపోతే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది అంటున్నారు  ప్యార్ ప్రేమ కాదర్ నిర్మాతలు.

 ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులు, హీరో,హీరోయిన్ క్యారక్టరైజేషన్స్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. తమిళంలో ఆల్రెడీ ఇదే టైటిల్ తో హిట్టైన ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ముందుగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ట్రైలర్ ని వదిలారు. ఆ ట్రైలర్ ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ట్రెండ్ గా మారింది.

ఇక ఈ ట్రైలర్ లో ఓ కుర్రాడు అమాయకంగా ఈ కాలం అమ్మాయి వెనక పడటం ఆమె …మా ఇంట్లో అమ్మానాన్న లేరు…అని మెడికల్ షాప్ దగ్గర ఏదైనా తెచ్చుకో అని అడగటం జనాలకు తెగ నచ్చేస్తోంది. ఏమో ఈ రొమాంటిక్ కామెడీ కుర్రాళ్లకు ఎక్కేసినా ఆశ్చర్యం లేదు.

 ఈ ప్యార్ ఇష్క్ కాదల్ సినిమా కు విజయ్ మొరవనేని-యువన్ శంకర్ రాజా సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హరీష్ కళ్యాణ్, రైజా జంటగా నటించిన  ఈ చిత్రం ఖచ్చితంగా మంచి బిజినెస్ చేస్తుందని నమ్ముతున్నారు.