పూరి జగన్నాథ్ చేస్తున్న కొత్త సినిమా ‘లైగర్’. విజయ్ దేవరకొండ ఇందులో హీరో. తెలుగుతో పాటు హిందీలో కూడ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్ ఈ సినిమా మీద చాలా ప్లానింగ్ చేసి పెట్టుకున్నారు. ఈ చిత్రంతో మరోసారి నేషనల్ లెవల్లో సక్సెస్ సాధించాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండకు కూడ ఈ సినిమా చాలా కీలకమైంది. దీంతోనే ఆయన బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు పూరి జగన్నాథ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం, భారీ బడ్జెట్ చిత్రం ఇదే. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే సినిమా మీద ఆశలు, అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
అయితే ఒక ప్రముఖ ఓటీటీ పూరి జగన్నాథ్ బృందానికి బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చిందట. అదేమిటంటే సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు 200 కోట్లు ఆఫర్ ఇచ్చారట. నిజానికి ఈ ఆఫర్ చాలామంచిది. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టిందట సదరు ఓటీటీ. అదేమిటంటే చిత్రాన్ని ఇక థియేటర్లలో వేయకుండా నేరుగా ఓటీటీలోనే వదలాలని. అదే పూరికి నచ్చలేదు. సినిమాను థియేటర్లలోకి వదిలి సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనేది పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, విజయ్ దేవరకొండల టార్గెట్. దాన్నే స్పెయిల్ చేసే డీల్ ఎంతమంచిది అయినా అక్కర్లేదని భావించి నో చెప్పారట.