పూరి డిస్క‌వ‌రీ పాన్ ఇండియా క‌ల‌లు క‌ల్లేనా?

పూరి డిస్క‌వ‌రీ పాన్ ఇండియా ఉబ‌లాటం

రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ఇస్మార్ట్ పూరి జ‌గ‌న్నాథ్‌ `ఫైట‌ర్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూరి-చార్మి-క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌లు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అన‌న్య పాండే క‌థానాయిక‌. లాక్ డౌన్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దుర‌దృష్ట వ‌శాత్తూ ఈ చిత్రాన్ని పూరి పూర్తిగా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించాల‌నుకుంటే మ‌హ‌మ్మారీ త‌రుముకొచ్చింది. దీంతో ప్ర‌స్తుతం వాయిదా ప‌డిన సంగ‌తి విధిత‌మే. లాక్ డౌన్ ఎత్తేశాక ఈ మూవీ షెడ్యూల్ ఎక్క‌డ ప్లాన్ చేస్తున్నారు? అన్న‌ది తెలియాల్సి ఉంది.

తాజాగా చిత్ర‌క‌థ‌నాయిక అన‌న్య పాండే .. ఆన్ లొకేష‌న్ స్టిల్స్ షేర్ చేసుకోవ‌డ‌మే గాక‌.. పూరి నుంచి పాన్ ఇండియా సినిమా వ‌స్తోంద‌ని ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యింది.

`బ‌జార్` బ్యూటీ క‌ళ్లు చెదిరే హాట్ లుక్

పాన్ ఇండియా సినిమా అంటే అందుకు త‌గ్గ‌ట్టే ప్లానింగ్ ఇంపార్టెంట్. తెలుగు,త‌మిళం, హిందీ స‌హా ఇత‌ర భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. ఇక బాలీవుడ్ వ‌ర‌కూ నోన్ ఫేస్ అన‌న్య పాండే ప్ల‌స్ అవుతుంద‌ని పూరి భావిస్తున్నారు. ఇక యంగ్ బ్యూటీ అన‌న్య పాండే నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో లైమ్ లైట్ లోనే ఉంటోంది. ఓవైపు హిందీ సినిమాలు చేస్తూనే ఫైట‌ర్ లో న‌టిస్తోంది. మ‌రోవైపు మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్లు.. ఫోటోషూట్లు అంటూ వేడెక్కించేస్తోంది. ప్ర‌ఖ్యాత బజార్ మ్యాగ‌జైన్ కోసం అన‌న్య ఇచ్చిన ఫోజు ప్ర‌స్తుతం యూత్ లో వైర‌ల్ గా మారింది.