సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ముగ్గులోకి లాగి వారి చేత వ్యభిచారం చేయిస్తూండటం చాలా కాలంగా జరుగుతున్న మోసమే. ఇప్పటికే అలాంటి మోసాలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి వ్యవహారం ఒకటి తమిళనాడులో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తోంది. సినిమాల్లో ఆఫర్స్ ఇప్పిస్తానని అమ్మాయిలని ట్రాప్ చేయటం, వారితో కామవాంఛ తీర్చుకోవడం, వ్యభిచారంలోకి దింపడం వంటి చర్యలకు పాల్పడుతున్న వ్యకి గుట్టును ఒక మహిళ బయట పెట్టింది.
వివరాల్లోకి వెళితే… చెన్నైకి చెందిన ఒక యువతి మోహన్ అనే సినీ కాస్టింగ్ డైరెక్టర్ అవకాశాల ఆశ చూపి అనేక మంది మహిళలను వ్యభిచారంలో దింపుతున్నాడని ఫేస్ బుక్ లో ఆరోపించింది. తానూ అమ్మాయిలతో కామ క్రీడలు నడుపి మోసం చేస్తున్నాడనే విషయాన్ని బయట పెడితే తనతో గడిపిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది.
మోహన్ ఆఫర్స్ పేరుతో ఆడవాళ్లను వాడుకుంటున్న ఆధారాలు తన వద్ద ఉన్నాయని తన ఫేస్‌బుక్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. అయితే ప్రస్తుతం తన పేరును రక్షణ దృష్ట్యా బయటకు చెప్పలేనని, తన వద్ద ఉన్న మోహన్ కామ క్రీడల సీన్ లను ఇప్పటికే తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశానని పేర్కొంది. ఆమె పోస్ట్ చేసిన మోహన్ రాసలీలల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.