ప్రియమణి వివాహానంతరం సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. బుల్లితెర జడ్జిగా.. వెబ్ సిరీస్ నటిగా పాపులరవుతోంది. ప్రియమని నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. మనోజ్ భాజ్ పాయ్ తో పోటీపడుతూ నటించింది. ఇక సినీకెరీర్ పరంగానూ వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఘనత తన సొంతం. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న విరాటపర్వంలో ప్రియమణి ఓ డిఫరెంట్ రోల్ తో సర్ ప్రైజ్ చేయబోతోంది. రానా-సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమని ఓ నక్సలైట్ పాత్రలో కనిపించనుంది.
నేడు ప్రియమణి పుట్టినరోజు కానుకగా `కామ్రేడ్ భరతక్క` పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లోని నాన్-మేకప్ అవతార్‌లో కూల్‌గా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే కామ్రేడ్స్ లో అంతర్గత సమస్యల్ని పరిష్కరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే పాత్రలో నటిస్తోందట. ఈ ఒక్క పోస్టర్ ఎన్నో విషయాల్ని రివీల్ చేస్తోంది.
రొమాంటిక్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాని డి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి పల్లవిపై ఈ చిత్రంలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. తదుపరి రానా నటించే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాల్సి ఉందిట. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తేసి షూటింగులకు అనుమతించిన సంగతి తెలిసిందే.