ఇది కరోనా కాలం బాస్. ఎవ్వరి మూతికి చూసినా మాస్కే. మాస్క్ లేకుండా బయటికి వస్తే ఫైన్ కూడా వేస్తున్నారు. అందుకే.. చిన్నాపెద్దా… పేదాధనిక అనే తేడా లేకుండా అందరూ మాస్కులు వేసుకొని బయటికి వస్తున్నారు.
కొందరైతే మాస్కుల్లోనూ వెరైటీని ప్రదర్శిస్తున్నారు. రకరకాల మోడల్స్ లో మాస్కులను తయారు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా బంగారం మాస్కులను కూడా తయారు చేయించారు. అయితే.. అన్ని మాస్కుల్లో ఎన్ 95 మాస్క్ బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఎన్ 94 మాస్క్ అంటే రెండుమూడొందలు ఉంటుంది కావచ్చు.
ఇంకా నాణ్యమైన మాస్కులు కూడా లభిస్తాయి. పిండి కొద్దీ రొట్టెలాగా ఎవరికి నచ్చిన మాస్కులను వాళ్లు వేసుకుంటున్నారు.
పూణెలో ఓ వ్యక్తి 3 లక్షల రూపాయలతో చేయించిన బంగారు మాస్క్ ను ధరిస్తున్నాడట రోజు. బయటికి కూడా ఆ బంగారు మాస్కును వేసుకొని తిరుగుతున్నాడట. ఎంత ధైర్యవంతుడో అతడు.
సూరత్ కు చెందిన మరో వ్యక్తి ఏకంగా వజ్రాలతోనే మాస్కును తయారు చేయించుకున్నాడట. దాని ధర అక్షరాలా 4 లక్షలట.
వామ్మో.. ఓవైపు కరోనాతో జనాలు అల్లాడుతుంటే వీళ్ల పిచ్చేంటి.. మాస్కుల్లో కూడా ఇంత వెరైటీ చూపిస్తున్నారు.. అంటూ జనాలు తిట్టుకుంటున్నారు.
సరే.. ఆ స్టోరీని అక్కడే వదిలేద్దాం. ఇఫ్పుడు మన ఏపీకి వెళ్దాం. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టుకునే మాస్కులను చూశారా ఎప్పుడైనా?
ఆయన ధరించే మాస్కులు చాలా సాధారణమైనవి. అంటే రక్షణలో కాదు.. డబ్బు విషయంలో. అవును.. ఆ మాస్కు ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. అవును.. మీరు చదివింది నిజమే. 50 రూపాయల మాస్కే అది.
చూడటానికి సింపుల్ గా ఉన్నా.. కంఫర్ట్ గా ఉంటుంది. కాటన్ తో తయారు చేసిన మాస్క్ అది. ఒకసారి.. ఓ వ్యక్తి జగన్ ను కలవడానికి వచ్చాడట. అప్పుడు ఈ మాస్క్ పెట్టుకొని వచ్చి సీఎం జగన్ ను కలిశాడట. అప్పుడే జగన్ ఆ మాస్క్ ను చూసి బాగుందని.. ఆర్డర్ చేయించారట.
అవి రామ్ రాజ్ కాటన్ మాస్కులు. ఆయన అప్పటి నుంచి వాటినే వాడటం మొదలు పెట్టారట. ఎప్పుడైతే సీఎం జగన్ వాటిని వాడటం మొదలు పెట్టారో.. ఏపీలో ఎక్కడ చూసినా అవే మాస్కులు దర్శనమిస్తున్నాయి.