రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే ఓ ఠీవీ, ఓ హుందాతనం, నిజంగానే ఓ మహారాజును చూసినట్టు అనిపించే ఆ భారీకాయం ఇలా అన్నీ గుర్తుకు వస్తాయి. అయితే కృష్ణంరాజులో స్పెషల్ టాలెంట్ దాగి వుందట. ఆ విషయాన్ని రెబల్ స్టార్ కూతురు ప్రసీదా ఉప్పలపాటి తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరాంధ్రకు స్పెషల్ వంటకం ఏదైనా ఉందా అంటే అది ముఖ్యంగా చేపలే. చేపలను వివిధ రకాలు వండి వడ్డిస్తే పొట్ట పగిలేలా తినొచ్చు. తాజాగా కృష్ణం రాజు కూడా ఇదే చేస్తున్నాడు. వీకెండ్ స్పెషల్‌గా ఇంట్లో చేపలు వండుతున్నారు. ఇక ఈ వీడియోను కూతురు ప్రసీదా షేర్ చేసింది. అందులో కృష్ణం రాజు తన స్పెషల్ టాలెంట్ గురించి చెప్పాడు. చేపల పులుసు వండుతూ.. వాసన చూశాడు. అయితే వాసన చూస్తే సరిపోతుందని, అందులో ఉప్పు కారం ఎంతుందనేది చెప్పొచ్చు అంటూ కృష్ణం రాజు పేర్కొన్నారు.
మామూలుగా మన లాంటి వాళ్లు అయితే వాటిని నోట్లో వేసుకుంటే గాని టేస్ట్ చెప్పలేం కానీ రెబల్ స్టార్‌కు మాత్రం కేవలం వాసన చూస్తే చాలట. ఇదే విషయాన్ని ప్రసీదా చెబుతూ.. ‘వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేస్తున్నారు.. మా నాన్న చేసే చేపల కూర ఈ ప్రపంచంలోనే అతి గొప్పగా ఉంటుంది. కేవలం వాసన చూసే ఉప్పు తక్కువగా ఉందా? ఎక్కువగా ఉందా? అని ఇట్టే చెప్పేస్తారు.. ఆ విషయంలో నాన్న ఎప్పుడూ ఫెయిల్ కారు.. అందులో నిపుణుడు’ అంటూ కృష్ణంరాజు స్పెషల్ టాలెంట్‌ను బయటకు చెప్పేసింది.
Weekend special: Dad’s fish pulusu. My dad makes the best fish in the world!!! And yes, he’s never wrong in telling if there’s enough salt or not, just by its smell. An expert indeed. @UVKrishnamRaju #fishpulusu #weekendspecial #daddydearest pic.twitter.com/7DCFmR51Q1
— Praseedha Uppalapati (@PraseedhaU) August 29, 2020