ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ “సలార్” నుంచి బిగ్ అప్డేట్ ఈ డేట్ న??

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా చేస్తున్న పలు భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా “సలార్” కూడా ఒకటి. భారీ వసూళ్లతో కలకలం రేపిన చిత్రం కేజీఎఫ్ తర్వాత నీల్ అందులోని ప్రభాస్ తో చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా నుంచి మాస్ టీజర్ కట్ ఎప్పుడో రావాల్సి ఉంది కానీ మేకర్స్ వాయిదా వేశారు. ఇక ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ఈ అప్డేట్ ని చిత్ర బృందం ఈ ఆగస్ట్ రెండో వారంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అంటే యాజ్ యూజువల్ మన తెలుగు సినిమా అప్డేట్స్ వస్తున్న విధంగా ఆగస్ట్ 14న సలార్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై అయితే సరైన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

ఇక ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబలే ఫిలింస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.