టైటిలే ప్రాణం అంటారు సినిమా జనం. సరైన టైటిల్ పడితే సగం హిట్ అయినట్లే అన్నట్లు భావించి ..అలాంటి కత్తిలాంటి టైటిల్ కోసం అన్వేషిస్తూంటారు. అలాగని నోటికొచ్చిన టైటిల్ పెడితే విమర్శలు పాలు అవుతారు. అదో పెద్ద డామేజి సినిమాకు. అయితే పెద్ద హీరోల సినిమాలకు ఏ టైటిల్ పెట్టినా జనాల్లోకి వెళ్తుంది…జస్టిఫై చేస్తే చాలు అంటారు.
రీసెంట్ గా నోటా అనే టైటిల్ పెట్టి..సినిమాల్లో నోటా కు సంభందించి ఒక్క సీన్ కూడా లేకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదో పెద్ద టాపిక్ అయ్యింది. అంతేకాదు ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాకు టైటిల్ పెట్టడం అంటే కత్తి మీద సామే. అటు అభిమానులను అలరించాలి. ఇటు సాధారణ ప్రేక్షకుల్లోకి వెళ్లాలి.
తాజాగా ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ‘అమూర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేంటి అమూర్ అనే పేరు ఎప్పుడూ వినలేదు కదా ..అనే సందేహం వస్తోంది కదా…అవును మీరు ఎక్సపెక్ట్ చేసింది కరెక్టే అది తెలుగు టైటిల్ కాదు..ప్రెంచ్ పదం.
ఫ్రెంచ్ లో అమూర్ అంటే ప్రేమ అని అర్దం. అందుకే ఆ టైటిల్ ని ఫైనలైజ్ చేస్తున్నారు అంటున్నారు. ఇక ఈ సినిమా 1970లో జరుగుతుందని, ప్రభాస్ పీరియడ్ లుక్ లో కనపడతాడని చెప్తున్నారు. అంతే కాదు కథలో ఎక్కువ భాగం యూరప్ లో జరుగుతుందని వినిపిస్తోంది. ఇంతకు ముందు ఇదే దర్శకుడు గోపీచంద్ తో జిల్ చిత్రం చేసాడు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు కానీ..లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేసాడని పేరు వచ్చింది.