ప్రభాస్ ఫామ్ హౌజ్ ధర.. చాలా కూల్ గురు

prabhas

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై ఎలా ఉంటాడో అందుకు భిన్నంగా రియల్ లైఫ్ లో ఉంటాడని అందరికి తెలిసిందే. చాలా సింపుల్ గా ప్రశాంతగా లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే ప్రయత్నం చేసాడు. షూటింగ్స్ లేకపోతే స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఇష్టమైన వంటకాలను ఆరగిస్తూ ఉంటాడు. ఇక ఎక్కువగా ఈ మధ్య ఫామ్ హౌజ్ జూ వెళుతున్నాడు ప్రభాస్. లాక్ డౌన్ లో ఎక్కువగా అక్కడే ఉన్నాడు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఆ ఫార్మ్ హౌజ్ గురించి ఇప్పుడు అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.

Prabhas Adopted A Reserve Forest

బాహుబలి అనంతరం ఎక్కువగా బాలీవుడ్ మీడియా ప్రభాస్ పర్సనల్ లైఫ్ స్టైల్ పై దృష్టి పెట్టింది. కాస్త గాసిప్ దొరికినా కూడా అనేక రకాల కథనాలను అల్లుతున్నారు. ఇక ఫామ్ హౌజ్ కు సంబంధించిన న్యూస్ లు కూడా బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ఇక దాని ధర రూ.60కోట్లని కూడా అంటున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తన లైఫ్ స్టైల్ కు తగ్గట్టుగా ఫామ్ హౌజ్ ను డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం.

ప్రభాస్ తనకు ఇష్టమైన వివిధ రకాల చెట్లను కూడా ఫామ్ హోజ్ లో పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ నగర శివార్లలో ఉన్నటువంటి కొన్ని అటవీ ప్రాంతాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల వరకు వాటి సంక్షేమం కోసం చేయాల్సిన పనులన్నీ చేయడం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాడు. ఇప్పటికే భారీగా ఖర్చు చేసి వన్య ప్రాణులకు ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాంతాలను పచ్చగా మార్చినట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమం కోసం ప్రభాస్ ఒక ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేశాడు.