“అనుష్కతోనా ? నేనా ? కనిపించానా ?”
చాలాకాలం తరువాత అనుష్క శెట్టి , డార్లింగ్ ప్రభాస్ గురించి మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తుంది . వీరిద్దరూ విషయాల్లో విహరిస్తున్నారని , అక్కడే ఓ లగ్జరీ ఇంటిని కూడా కొనుకున్నారని తెగ ప్రచారం జరుగుతుంది . దీనిపై ప్రభాస్ స్పందించాడు . ఇవ్వన్నీ గాలి వార్తలని కొట్టిపడేశారు . మేము ఇద్దరం మీకు ఎవరికైనా కనిపించామా ? లేనప్పుడు ఎందుకు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారు ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .
ప్రభాస్ , అనుష్క “బిల్లా” , “మిర్చి ” చిత్రాల్లో నటించిన తరువాత రాజమౌళి “బాహుబలి ” చిత్రంలో చాలాకాలం కలసి వున్నారు , షూటింగ్ చేశారు . అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ అంకురించిందని అంటారు . అనేక సందర్భాల్లో వీరు తామ మంచి స్నేహితులమని కూడా చెప్పారు . చాలాకాలం నుంచి అనుష్క , ప్రభాస్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోకుండా ఒకరి కోసం మరొకరు వేచి ఉన్నారనే వార్తలు వస్తున్నాయి . మరి ఇప్పుడు తమ మధ్య ప్రేక్షకులు అనుకుంటున్నది ఏమీ లేదని ప్రభాస్ ప్రకటించాడు . అనుష్క మాత్రం మౌనంగా వుంది . నిజంగానే వీరి మధ్య ఏమీలేదా ?