PK అనే రెండు అక్షరాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను షేక్ చేస్తాయన్న సంగతి తెలిసిందే. అందరూ వారిని జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అనుబంధం అలాంటిది. కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాలన్న కల నెరవేరని అందాల నటి పూనం కౌర్ పీకే అనే రెండక్షరాల్ని ఎలా ఉపయోగించుకుంటోందో తెలిసిందే.
ఈలోగానే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పీకేపై వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగడం అనంతర పరిణామాలు తెలిసిందే. శ్రీరెడ్డి ఒక పోస్ట్‌తో పవన్ కళ్యాణ్ – పూనం కౌర్ ఇద్దరినీ లక్ష్యంగా చేసుకుంది. ఆ ముగ్గురి మధ్యా కత్తి మహేష్ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ రంగు బయటపడింది. పవన్ కళ్యాణ్ – పూనమ్ కౌర్ వ్యవహారం గురించి శ్రీరెడ్డి సహా కత్తి మహేష్ రకరకాల విమర్శలు గుప్పించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.
శ్రీ రెడ్డి, పూనం కౌర్ మాటల యుద్ధం అనంతర పరిణామాలు తెలిసిందే. కొంతకాలం క్రితం పూనమ్ కౌర్ శ్రీ రెడ్డిని వేశ్యగా ముద్రవేయడంతో తాజాగా శ్రీరెడ్డి ఆశ్చర్యకరమైన దాడి చేసింది. పూనమ్ కౌర్ పీకే అనే అక్షరాలు ముద్రించిన మాస్క్ (మూతికి) వేసుకోవడంతో అసలైన గొడవ ప్రారంభమైంది.
శ్రీ రెడ్డి పూనమ్ ని ‘మాస్క్ కే పీచే క్యా హై’ అని ప్రశ్నించి ఎగతాళి చేసింది.ఆ ప్రశ్నకు సీరియస్ అయిన పూనమ్ కౌర్ శ్రీరెడ్డిని వేశ్యగా ముద్రవేసారు. ఫ్రీడమ్ అని అమ్మా నాన్నా ని వదిలేసి .. డబ్బూ అని క్యారెక్టర్ ని వదిలేసి అంటూ శ్రీరెడ్డిని దునుమాడింది.
దీనికి కౌంటర్ గా శ్రీరెడ్డి మరోసారి టచ్ లోకి వచ్చింది. పూనమ్ కౌర్ మూడుసార్లు వివాహం చేసుకున్న వ్యక్తి నుండి భారీ మొత్తాన్ని గుంజుకుందని.. శ్రీ రెడ్డి ఒక సంచలన పోస్ట్ తో అభిమానుల్లో కల్లోలం సృస్టించింది. ఆ వ్యక్తి ఎవరు? అంటే.. పవన్ కళ్యాణ్ అని పిలుస్తారు అని హింట్ ఇచ్చేసింది. మొత్తానికి పూనమ్ వర్సెస్ శ్రీరెడ్డి ఎపిసోడ్ లో ఎంతో డిగ్నిఫైడ్ గా ఉండాల్సిన పీకే పేరు అపవిత్రమవుతోంది.
ఇక నిన్నటి వేరొక ఎపిసోడ్ పైనా పూనమ్ స్పందించిన తీరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు.. మీరా చోప్రా ఎపిసోడ్ లో అసలు ఎన్టీఆర్ అభిమానుల తప్పిదం ఏమీ లేదని.. కొందరు రాజకీయ నాయకులు ఫ్యాన్స్ పేరుతో ఆడే నాటకమిదని పూనమ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం వేడెక్కిస్తోంది. ఫ్యాన్స్ ను శిక్షించకుండా అలాంటి వారిని వెతికి జైల్లో వేయాలని కోరింది.