ఫోటో టాక్: చీర క‌డితే ఆమె మాత్ర‌మే క‌ట్టాలి అనిపించే అంత అందం!!

చీర‌క‌ట్టులో కొంద‌రిని ఎంత సేపు చూసినా త‌నివి తీర‌దు. ఆ చీర క‌ట్టు అందం అలాంటింది మ‌రీ. ఇక చీర క‌ట్టులో సినిమా హీరోయిన్లు అందాల ఒంపు సొంపుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మోడ్ర‌న్ డ్రెస్స్ లో చూసే భామ మ‌ణులు  ఒక్క‌సారిగా ట్రెడీష‌నల్ గా క‌నిపించేస‌రికి కొత్త క‌విత్వాలు త‌న్నుకు రావాల్సిందే. చీర‌క‌ట్టులో చూస్తూ ఎక్క‌డ క‌నురెప్ప కొడితే ఆ అద్భుత దృశ్యం మ‌న క‌నుల ముందు నుంచి మాయ‌మ‌వుతుందేమోన‌న్న భావ‌న క‌ల్గుతుంది. వంపు సొంపుల‌ను చూపించి చూపించ న‌ట్టు ఉండే ఆ యాన‌క‌మే చీర‌క‌ట్టు. చీర‌క‌ట్టులో క‌నిపించీ క‌నిపించ‌ని ఆ న‌డుము సోయ‌గాలు, ఎద పొంగులు మ‌ల‌య మారుతం. అందం మ‌హా సాగ‌ర‌మంత‌.

ఇలా మ‌నం త‌న్మ‌య‌మ‌య్యే విష‌యాలు చీర క‌ట్టులో చాలానే ఉన్నాయి. తాజాగా ఆ విశాఖ భామ‌ని చీర క‌ట్టులో చూస్తే చెంగావి రంగుచీర క‌ట్టుకున్న చిన్న‌ది..దీని త‌స్స‌దియ్య‌.. అంద‌మంతా చీర‌లోనే ఉన్న‌ది అని పాటేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మ‌డు చీర‌లో అంత అందంగా క‌నిపిస్తోంది. విశాఖ‌కు చెందిన పూజిత పొన్నాడ కొన్నాళ్ల‌గా టాలీవుడ్ లో సీరియ‌స్ గా సినిమా ప్ర‌య‌త్నాల్లో ఉంది. `రంగ స్థ‌లం` సినిమాలో న‌టించిన త‌ర్వాత రెండు, మూడు సినిమాల్లో న‌టించింది కానీ అమ్మ‌డికి స‌రైన గుర్తింపు ఇంకా రాలేదు.

తాజాగా ఎప్పుడూ మోడ్ర‌న్ డ్రెస్స్ ల్లో మెరిసే పూజిత ఎంద‌క‌నో చీర క‌ట్టింది. డార్క్ బ్లూ పైటంచుతో కూడిన తెల్ల చీర‌లో అందాల‌న్నీ క‌ప్పేసి తెలుగ‌మ్మాయిని అని చెప్ప‌క‌నే చెప్పింది. చీర‌లో అందాల్ని విచ్చ‌ల‌విడిగా ఎలివేట్ చేసే ఆస్కారం ఉన్నా అమ్మ‌డు ఆ హ‌ద్దు మీర‌లేదు. మ‌రి స్కిన్ షోల‌తో రెచ్చిపోయే అమ్మ‌డు చీర‌ల సంప్ర‌దాయం దేనికోస‌మో! ఏమాట‌కామాటే? రాజా! చీర క‌డితే ఆమె మాత్ర‌మే క‌ట్టాలి అనిపించే అందం అమ్మ‌డి సొంతం.