విశాఖ నుంచే జగన్ పాలన.. పవన్, చంద్రబాబు వెనుకడుగు వేయగలరా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించడం ద్వారా ఇక్కడి ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటున్నారు. ఒక రాజధానికి కావాల్సిన అన్ని లక్షణాలు విశాఖలో ఉన్నాయి. ఏపీలో వేగంగా అభివృద్ధి చెందిన జిల్లాలలో విశాఖ కూడా ఒకటని చెప్పవచ్ఛు. పవన్, చంద్రబాబు విశాఖకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విశాఖ ప్రజలకు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీకి పట్టు తక్కువ. అయితే మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుంటూ జగన్ అడుగులు వేస్తున్నారు. జగన్ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని 2024 ఎన్నికల సమయానికి విశాఖ అభివృద్ధి దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం. ఏపీలో పలు భారీ కంపెనీల దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. జగన్ తన మార్కు పాలనతో రాబోయే ఏడాది ముందుకెళ్లనున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ జనసేన నుంచి పోటీ ఎదురు కాకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీలు ఏపీలో పుంజుకుంటే వైసీపీకి ఇబ్బంది అని జగన్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీకి మరోసారి 2024 ఎన్నికల్లో షాక్ తగిలేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని సమాచారం. పవన్, చంద్రబాబులకు రాబోయే రోజుల్లో మరిన్ని షాకులు తప్పవని సమాచారం.

సీఎం జగన్ ప్లాన్స్ వర్కౌట్ అయ్యి ఏపీలో 2024 ఎన్నికల్లో మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందేమో చూడాలి. వైసీపీ ఏ ఎన్నికలు జరిగినా సత్తా చాటుతుందని వైసీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు. 2024 ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా ఈ ఏడాదిలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.