వారంలో ఏ రోజున అప్పు తీసుకోవడం మంచిది… ఏ రోజున తీసుకోకపోవడం మంచిదో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండడం కోసం కష్టపడుతూ పనిచేస్తుంటారు అయితే కొన్ని కారణాల వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్టే పోవటం వల్ల తప్పనిసరి పరిస్థితులలో కొందరి దగ్గర అప్పులు చేయవలసి ఉంటుంది. ఇలా కొందరు చేసిన అప్పులను తీర్చడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే వారు తీసుకున్న అప్పు సరైన సమయంలో తీసుకోలేదని అర్థం ఇలా మనం సరైన సమయంలో అప్పు తీసుకోకపోవడం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు జన్మలో తీర్చలేరు.

అందువల్ల అప్పు తీసుకోవడానికి కూడా శుభ ఘడియలు మంచి రోజులు చూసి అప్పు తీసుకోవటం వల్ల ఆపు తొందరగా చెల్లించవచ్చు మరి అప్పు తీసుకోవడానికి మంచి రోజు ఏది… ఏ రోజున అప్పు తీసుకోకూడదు అనే విషయానికి వస్తే. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…మంగళవారం, బుధవారం, శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల వద్ద అప్పు చేయకూడదు. అంతేకాకుండా హస్త, మూల, అద్ర, జ్యేష్ట, విశాఖ, ఉత్తరాఫాల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తర భాద్రపద, రోహిణి వంటి ఆశుభ నక్షత్రాల్లో ఇతరుల వద్ద అప్పు చేసినా కూడా జీవితాంతం ఆ రుణం తీర్చలేక పోతారు.

అయితే మంగళవారం రోజున తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించటం చాలా మంచిది. సోమవారం, బుధవారం, ఆదివారం ఆదివారం రోజున అప్పు తీసుకోవడం వల్ల ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్వాతి, పునర్వసు, ధనిష్ట, శతభిష, మృగశిర, రేవతి, చిత్ర, అనురాధ, అశ్విని, పుష్య వంటి శుభ నక్షత్రాలలో ఇతరుల వద్ద అప్పు చేయటం లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మంచి రోజులలో అప్పు తీసుకోవడం వల్ల తొందరగా వారి అప్పు తిరిగి ఇచ్చే అవకాశం మనకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.