మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే! వారానికి రెండుసార్లు ఈ చిట్కాలను పాటిస్తే చాలు!

How-does-vitamin-D-benefit-your-skin_mobilehome

చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి మార్కెట్లో దొరికే అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించి అలసిపోయారా అయితే మన వంటింట్లో ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మ సమస్యలను తొలగించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు . దీనికోసం మీరు చేయవలసిందిగా కొంత సమయాన్ని కేటాయించడమే. ఇంకెందుకు ఆలస్యం సహజ పద్ధతిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన వంటింట్లో ఖచ్చితంగా ఉండే చక్కర, పాలు బియ్యం పిండితో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు దీనికోసం ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ పచ్చి పాలు వీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అర గంట త‌ర్వాత శుభ్రం చేసుకుంటే పొడిబారిన చర్మ కణాలు ఉత్తేజితం అయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న తేనే, కుంకుమపువ్వు మిశ్రమంతో చర్మ సమస్యలన్నీ తొలగించుకోవచ్చు దానికోసం టీస్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్ల మచ్చలు, కంటి కింద వలయాలు తగ్గి చర్మం సహజ స్థితికి వస్తుంది.బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకొని అందులో కొంత బియ్యప్పిండి, ఆరంజ్ నూనెను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

వేసవిలో పొడి బారిన చర్మంతో ఇబ్బంది పడుతుంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్న
బంగాళాదుంపను ఉడికించి మెత్తటి గుజ్జుగా మార్చుకున్న తర్వాత అందులో కొంచెం పాలు, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేస్తే సహజ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.