నటసింహ బాలకృష్ణ ఇటీవల గుండు గీయించికుని న్యూలుక్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తన కొత్త సినిమా కోసమే ఇలా గుండుతో ప్రత్యక్షమయ్యారని జోరుగా కథనాలు వెడెక్కించాయి. బోయపాటి శ్రీను ఆదేశాల మేరకే బాలయ్య ఇలా కొత్త అవతారంలో కనిపిస్తున్నారని ప్రచారం సాగింది. అదే గెటప్ తో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో బాలయ్య సమకాలికులు…వైకాపాఎమ్మెల్యే రోజా ఆయనతో సెల్ఫీలు దిగి సందడి చేసారు. మరి ఈ లుక్ కొత్త సినిమా కోసమేనా? లేక మరేదైనా కారణం ఉందా? అంటే ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇది బాలయ్య న్యూ లుక్ కాదు…సినిమా కోసం అంతకన్నా కాదుట.
త్వరలో బాలయ్య తన బాల్డ్ హెడ్ కి పర్మినెంట్ సోల్యూషన్ కి వెళ్లిబోతున్నారుట. ఫిబ్రవరిలో దుబాయ్ లో హెయిర్ ట్రాన్స్ ప్లాంటినేషన్ కోసం డాక్టర్ల సలహా మేరకు గుండు చేయించుకున్నారుట. దుబాయ్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో ఖరీదైన ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారుట. దానికి సంబంధించిన పనులన్నింటిని బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ చూసు కుంటున్నాడుట. చికిత్స కోసం బాలయ్య వారం పది రోజులు దుబాయ్ లోనే ఉండనున్నారని సమాచారం. ఆ విషయం పక్కనబెడితే బాలయ్యకు సినిమాల్లో కొన్నేళ్లగా విగ్గులు సమస్యగా మరిన సంగతి తెలిసిందే. ఇటీవల రూరల్ వాడిన విగ్గులపై నెటి జనులు కామెంట్లు కురిపించారు. ఇంతలో బాలయ్య ఇలా పర్మినెంట్ ట్రీట్ మెంట్ కు రెడీ అవ్వడం ఆసక్తికరం.