తారాగణం : కీర్తి సురేష్, లింగా తదితరులు
నిర్మాత : కార్తీక్ సుబ్బరాజు
సంగీతం : సంతోష్ నారాయణన్
రచన- దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
జోనర్: సస్పెన్స్ థ్రిల్లర్
రిలీజ్ తేదీ: 19 జూన్ 2020
`మహానటి` ఫేం కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం `పెంగ్విన్` అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా సైకో కిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కింది. అయితే మూవీ ఆద్యంతం యంగేజ్ చేసేంత గ్రిప్పింగ్ గా ఉందా లేదా? అన్నది తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.
కథ కమామీషు:
ఒక గర్భిణి మిస్సయిన కొడుకును వెతుక్కుంటూ సాగించే ప్రయాణంలో ఎలాంటి మానసిక సంఘర్షణ ఎదురైంది? ఈ కథలో థ్రిల్లింగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆద్యంతం రక్తి కట్టించాయా లేదా? విధికి ఎదురెళ్లి పోరాటం సాగించిన గర్భిణి సాహసం వర్కవుటైందా లేదా? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
రిథమ్ (కీర్తి సురేష్) కొడుకు మిస్సింగ్ మిస్టరీతో సినిమా సాగుతుంది. అసలు కిడ్నాపర్ తన కొడుకునే ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఈ కథలో `జోకర్` తరహా మాస్క్ మ్యాన్ ఎవరు? అతడి ప్రవృత్తి ఏమిటి? అన్నది తెరపైనే చూడాలి. అయితే ఈ సినిమాలో ఇద్దరు భర్తలు అన్న టాస్క్ కీలక మలుపు.
సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠను పెంచడంలో సఫలమైనా ల్యాగ్ బోరింగ్ టాస్కులకు కొదవేమీ లేదు. దీంతో అక్కడక్కాడా మెరుపులు.. సినిమా ఆద్యంతం జర్కులు అన్నట్టుగానే కనిపిస్తుంది.
నటీనటులు- టెక్నీషియన్స్: అందరూ ఊహించినట్టే కీర్తి సురేష్ నటన సినిమాకే హైలైట్. పెంగ్విన్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే కథాంశం ఉంది. ప్రథమార్థంలో సస్పెన్స్.. ఎమోషనల్ సీన్స్ లో కీర్తి నటన రక్తి కట్టించింది. కుమారుడు మిస్ అయ్యాక వెతికే సన్నివేశాల్లో .. డాక్టర్ సీక్వెన్స్ లో కీర్తి నటన ఆకట్టుకుంది.
మదర్ సెంటిమెంట్ ని దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ వర్కవుట్ చేసిన తీరు ఆసక్తికరం. ఒంటరి తల్లులకు బాగా ఎక్కే కాన్సెప్ట్. లింగ .. భావన పాత్రధారి నటన ఆకట్టుకుంది. రీరికార్డింగ్ ప్లస్.
ప్లస్ పాయింట్స్ :
*గర్భిణిగా, ఒంటరి తల్లిగా కీర్తి సురేష్ నటన
* సస్పెన్స్.. ఎమోషన్ సీన్స్
* కథా వైవిధ్యం
మైనస్ పాయింట్స్:
* ల్యాగ్.. సాగదీత
* ప్రథమార్థంలో కన్ఫ్యూజన్
* కమర్షియల్ అంశాలు మిస్సింగ్
ఫైనల్ వర్డ్:
మల్టీప్లెక్స్ కి ఓకే.. కీర్తి ఫ్యాన్స్ కి నచ్చుతుంది
రేటింగ్ : 2.5/5