ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. దర్శకుడు క్రిష్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అనేక హంగులతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి ఆ మధ్య ఆడియో హక్కులపై ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది అని అప్డేట్ బయటకి వచ్చింది. దీని తర్వాత అది “టిప్స్ ఆడియో” అని తెలుసుకున్నాక ఇలాంటి సంస్థ కూడా ఒకటి ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు.
కానీ తర్వాత దాని పుట్టు పూర్వోత్తరాలు బాలీవుడ్ లో వెతకగా ఇప్పుడు ఉన్న సంస్థల కన్నా ఎప్పటి నుంచో ఉన్న భారీ సంస్థ ఇది అని అంతా అవాక్కయ్యారు. మరి ఇప్పుడు ఇదే సంస్థ మరో భారీ పాన్ ఇండియా సినిమా అందులోని దర్శకుడు మణిరత్నం నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “పొన్నియిన్ సెల్వన్” మొదటి భాగం హక్కులను రికార్డు మొత్తం ధరకి సొంతం చేసుకున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.
మరి వీరు అయితే ఈ చిత్రానికి 24 కోట్లు ముట్టజెప్పారట. దీనితో తమిళ్ లో ఇది భారీ రికార్డు అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి లెజెండరీ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే విక్రమ్, కార్తీ లు నటించిన ఈ చిత్రంలో త్రిష, ఐశ్వర్య రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 22న విడుదల కాబోతుంది.