Maniratnam: నవీన్ పొలిశెట్టితో పాన్ ఇండియా మూవీ గురించి స్పందించిన మణిరత్నం.. ఆయన స్పందన ఇదే!

Maniratnam: డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మణిరత్నం. తెలుగుతోపాటు హిందీ తమిళ భాషల్లో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పటికీ మణిరత్నం సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసే అభిమానులు ఉన్నారు. రోజా, బొంబాయి వంటి చిత్రాల నుంచి పొన్నియన్ సెల్వన్ సినిమాల వరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి.

ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న సినిమా థగ్ లైఫ్. కమల్ హాసన్, త్రిష, శింబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మణిరత్నం. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో పాన్ ఇండియా ఫిల్మ్ రానుందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందనే టాక్ సైతం నడుస్తోంది.

ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి సరసన కన్నడ భామ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్ లలో అసలు విషయం బయట పెట్టారు మణిరత్నం. కాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ఈ రూమర్స్ పై స్పందిస్తూ.. నా వరకు అవి కేవలం వార్తలు మాత్రమే, ప్రస్తుతం నేను కొన్ని స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాను. ది ముందుగా తెరపైకి వస్తుందో తెలియదు అని అన్నారు మణిరత్నం. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే నవీన్ పొలిశెట్టి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై క్లారిటీ కూడా వచ్చేసింది. ఇకపోతే నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి మంచి ఊపు మీద ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నవీన్ నటించిన సినిమాలు కూడా వరుసగా హిట్ అవుతున్నాయి.