థగ్ లైఫ్ సినిమా ట్రైలర్‌తోనే సందడి చేసిన కమల్ హాసన్ – మణిరత్నం కాంబో ఇప్పుడు మరో కారణంగా చర్చల్లోకి వచ్చింది. ట్రైలర్‌లో కామల్, నటి అభిరామి మధ్య కనిపించిన లిప్‌లాక్ సీన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది కేవలం విజువల్ హైప్‌కే ఉపయోగపడిందా లేక కథలో కీలక భాగమా అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కమల్ వయసుతో పోలిస్తే అభిరామి ఎంతో చిన్నవారి కావడంతో, ఈ సన్నివేశం సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలను తీసుకొచ్చింది.
ఇలాంటి వాదనల నడుమ అభిరామి తొలిసారి తన వివరణ ఇచ్చారు. “ఇది కేవలం మూడు సెకన్ల సన్నివేశం మాత్రమే. దాన్ని ఆధారంగా చేసుకుని ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా?” అని ప్రశ్నించింది. ఆ సీన్ చేసేందుకు తనకు ఇబ్బంది ఏమీలేదని స్పష్టం చేసిన ఆమె, మణిరత్నం గారి విజన్‌ను గౌరవించానని తెలిపింది. “ఆ పాత్రకు నేను సరిపోతానని ఆయన నమ్మారు. నేను కూడా దర్శకుడి దృష్టిని గుర్తించి పని చేశాను” అంటూ అభిరామి వివరణ ఇచ్చారు.
ముఖ్యంగా, మణిరత్నం లాంటి దర్శకుడు ఒక లిప్‌లాక్‌ను అర్థంతో డిజైన్ చేస్తాడని అభిరామి అభిప్రాయపడ్డారు. “మణి సార్ లాజిక్‌ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆయనకు ఓ క్లారిటీ ఉంటుంది. సినిమా మొత్తం చూసిన తర్వాతే ఈ సన్నివేశం అసలెంత కీలకమో తెలుసుకుంటారు” అని చెప్పారు.