హిందీ ‘అజ్ఞాతవాసి’ రికార్డ్

వాళ్లకేం నచ్చిందో..అంత పెద్ద హిట్ చేసేసారు
 
కొన్ని రికార్డ్ లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ హీరోల సత్తాకు అభిమానం పొంగి పొరులుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ  చివరగా చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని కూడ తీవ్ర నిరాశకు గురిచేసింది. వైఫల్యంలో ఆచిత్రం టాలివుడ్ రికార్డు.  కానీ ఇప్పుడదే   సినిమాను ఇటీవలే హిందీ భాషలోకి డబ్ చేసి విడుదలచేస్తే రికార్జ్ లు క్రియేట్ చేస్తోంది.
 
 ‘అజ్ఞాతవాసి’ హిందీ వెర్షన్ 24 గంటల్లోనే 9.6 మిలియన్ల వ్యూస్ పొంది అత్యధిక వ్యూస్ సాధించిన దక్షిణాది చిత్రంగా నిలవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అభిమానులను ఆనందపరుస్తోంది.  గతంలో ఈ రికార్డ్ తమిళ స్టార్ హీరో  అజిత్ చిత్రం ‘వివేగం’ పేరిట ఉండగా ఇప్పుడది పవన్ సొంతమైంది.  
 
 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం పవన్ హీరో కాగా కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్. ఖుష్బూ, ఆది పినిశెట్టి, బొమన్‌ ఇరానీ, రావు రమేశ్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, తనికెళ్ల భరణి తదితరులు  కీలక పాత్రలు పోషించారు.   అనిరుధ్‌  సంగీతం అందించారు.  పాటలు మంచి హిట్ అయ్యాయి. అలాగే మ‌ణికంద‌న్ కెమెరా వర్క్ కూడా కేక పెట్టింది.