మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. గతంలో పవన్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో రూపొందించిన `అజ్ఞాతవాసి` సినిమా విషయంలో లీగల్ ఇబ్బందుల్లో ఇరుక్కున్న త్రివిక్రమ్ మళ్లీ అదే తరహా కేసులో ఇరుక్కున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. `అజ్ఞాతవాసి` చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ `లార్గో వించ్` ఆధారంగా రూపొందించారు. దీని హక్కులు టీ సిరీస్ వారు అధికారికంగా సొంతం చేసుకున్నారు. హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. అయితే వారికి తెలియకుండానే తెలివిగా త్రివిక్రమ్ `అజ్ఞాతవాసి` పేరుతో మక్కీటూ మక్కీ దించేశాడు.
ఈ విషయం మీడియా ద్వారా బయటికి పొక్కడంతో టీ సిరీస్‌తో పాటు `లార్గో వించ్` దర్శకుడు జెరోమ్ సల్లే లైన్‌లోకి వచ్చి నష్టపరిహారం కట్టాల్సిందే లేదంటే లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని హెచ్చరించారు. దీంతో చేసేది లేక ఆ రైట్స్ కి సంబంధించిన మొత్తాన్ని త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ కట్టాల్సి వచ్చింది. మళ్లీ అదే తరహా చిక్కుల్లో `అల వైకుంఠపురములో` సినిమాతో త్రివిక్రమ్ లీగల్ ఇబ్బందుల్లో పడబోతున్నాడు. 2005లో ఈ చిత్ర కథని ఓ కృష్ణ అనే ఓ యువ దర్శకుడు త్రివిక్రమ్‌కు వినిపించాడట. ఆ తరువాత 2013లో ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించాడట. తను చెప్పిన కథనే తనకు తెలియకుండా త్రివిక్రమ్ తెలివిగా లేపేశాడని, లీగల్‌గా అతన్ని ఎదుర్కొంటానని చెప్పడం సంచలనంగా మారింది.