టాలీవుడ్ హీరోయిన్ కి అలాంటి పనులు చేయమని సలహాలిచ్చింది వీళ్ళేనా..?

anu emmanuel

అనూ ఇమాన్యుల్.. నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ఞు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయినా అనూ ఇమాన్యుల్ కి హీరోయిన్ గా మంచిపేరే వచ్చింది. అంతేకాదు వరసగా టాలీవుడ్ స్టార్స్ సరసన నటించే అవకాశాలు అందుకుంది. నిజంగా కెరీర్ ప్రారంభం లోనే ఇలాంటి అవకాశాలు రావడం గొప్ప విషయం, అదృష్టం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య, నాగ చైతన్య తో శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాలు చేసింది.

Telugu Movie Schedules in UK | Ap2uk.com

అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సక్సస్ సాధించలేకపోవడం తో ఇక అనూ ఇమాన్యుల్ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే గ్యాప్ లో కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక మందన్న ఫుల్ ఫాం లోకి వచ్చి స్టార్స్ గా వెలుగుతున్నారు. అదీకాక అను కాస్త బొద్దుగా ఉండటం కూడా మైనస్ అయింది. దాంతో సన్నిహితవర్గాలు అనూ ఇమాన్యుల్ కి సలహాలిచ్చారట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి తగ్గట్టు హీరోయిన్ గా లాంగ్ టైం ఇండస్ట్రీలో ఉండాలంటే కొన్ని తప్పవని చెప్పారట.

Sizzling Hot Beautiful Anu Emmanuel - Telugu Photos Emmanuel-Telugu  Trending Latest News Updates-TeluguStop

దాంతో అనూ ఇమాన్యుల్ ఇన్నాళ్ళు బాగా వర్కౌట్స్ చేసి యమా స్లిమ్ గా తయారైంది. ఇప్పుడు గనక ఈ బ్యూటీని చూస్తే ఎవరైనా ఫ్లాటైపోవాల్సిందే అన్నట్టుగా హాట్ గా తయారైంది. ప్రస్తుతం మేకర్స్ కూడా అవకాశాలు లేని.. కాస్తో కూస్తో ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న వాళ్ళవైపు చూస్తున్నారట. కాబట్టి అనూ ఇమాన్యుల్ కి ఇది కలిసొచ్చే సమయమే అంటున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీను హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో అవకాశం అందుకుంది. చూడాలి మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ అనూ ఇమాన్యుల్ వరసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ అనిపించుకుంటుందో లేదో.