ప‌వ‌ర్ స్టార్ కి పోటీగా `ప‌రాన్న జీవి`

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ` ప‌వ‌ర్ స్టార్` టైటిల్ తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఉద్దేశించి ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ రాజ‌కీయ జీవితాన్ని ఇందులో సైటైరిక‌ల్ గా చూపించ‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్ల‌ను బ‌ట్టి తేలిపోయింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వ‌ర్మ‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడే చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని, పార్టీని కించ‌ప‌రిచేలా పోస్ట‌ర్లు ఉన్నాయ‌ని అభిమానులు మండిప‌డుతున్నారు. సినిమా రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ పైత్యాన్ని దించ‌డానికి అభిమానులు ప‌వ‌ర్ స్టార్ కి పోటీగా `ప‌రాన్న జీవి` అనే టైటిల్ తో వ‌ర్మ‌పైనే ఓ సినిమా చేస్తున్నారు.

`రెక్ లెస్ జెనిటిక్` అనేది ఉప శీర్షిక‌. పవ‌ర్ స్టార్ సినిమాకు పోటీగానే `ప‌రాన్న జీవి` ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్ని ప‌వ‌న్ అభిమానులు ప్లాన్ చేసారు. ఈనేప‌థ్యంలో ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్ రిలీజ్ అవుతున్న ఈనెల 22న `ప‌రాన్న జీవి` ట్రైల‌ర్ ని కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమాను ఈనెల 25న ప‌వ‌ర్ స్టార్ కి  పోటీగా ప‌రాన్న జీవిని తీసుకొస్తున్నారు. ఈసినిమాకు ప‌వ‌న్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ దెబ్బ‌కి వ‌ర్మ తిక్క కుద‌రాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎదుట వారి జీవితాల‌పై మ‌ళ్లీ వ‌ర్మ సినిమా చేయాలంటే? ప‌రాన్న జీవి దెబ్బ‌కి బెదిరిపోవాలంటూ మండిప‌డుతున్నారు.

ఇక వ‌ర్మ‌ని ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గ‌మంతా ప‌రాన్న జీవితో పోల్చుతుంటారు! అన్న సంగ‌తి తెలిసిందే. ప‌రాన్న జీవి అంటే? ఏంటి? అంటే..వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడు, అందులో ఒకటి రెండోదానికి నష్టం కలిగిస్తూ, తాను లాభం పొందుతూ జీవిస్తుంది. లాభం పొందే జీవిని ‘పరాన్నజీవి` అని శాస్ర్తీయంగా అంటారు. ఇక ఆర్జీవీపై మంట‌తో ర‌చ‌యిత జొన్న విత్తుల ‘ఆర్జీవీ – రోజూ గిల్లే వాడు’ అనే టైటిల్‌తో మరో సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.