Sree Leela: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శర్వానంద్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో హీరోలకు తమ్ముడి పాత్రలలో నటించారు. అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటు మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇటీవల కాలంలో శర్వానంద్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. ఇలా ఈయన సినిమాలు సక్సెస్ కాకపోయినప్పటికీ సినిమా అవకాశాలు రావడంతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
తాజాగా శర్వానంద్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో శతమానం భవతి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలోనే మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుందనే విషయం తెలియగానే సినిమా పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది.
ఇక ఈ సినిమా విషయంలో మరొక స్టార్ హీరోయిన్ శ్రీ లీల దారుణంగా శర్వానందును అవమానించారని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కంటే కూడా ముందుగానే శ్రీ లీలను సంప్రదించారట. కాకపోతే ఇటీవల శర్వానంద్ వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కోవడంతో ఆయనతో కలిసి సినిమాలలో నటించడానికి ఇష్టపడలేదని అందుకే రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.
ఇలా శ్రీ లీల రిజెక్ట్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాకు కమిట్ అయ్యారు అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు శ్రీ లీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ లీల కూడా ఇప్పటివరకు పలు సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారని, వరుస ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకున్న ఈమె ఒక హీరోని రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. ఇంత హెడ్ వెయిట్ పనికిరాదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.