ఈ మధ్యకాలంలో బూతుకు బాగా డిమాండ్ పెరిగింది. తెలుగు,తమిళ భాషల్లో బూతు ఉద్యమం జరుగుతున్నట్లుంది. చిన్న సినిమాలన్నీ ఆ దారిన పట్టాయి. తాజాగా బిగ్‌బాస్ ఫేం ఓవియా నటిస్తున్న తొలి చిత్రం ‘90 ఎంఎల్’ ఈ అడల్ట్ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. అనిత ఉదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఒక నిమిషం 50 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ లోని సన్నివేశాలు యువతకు కిక్కెక్కించేలా ఉన్నాయి.
టీనేజ్ అమ్మాయిలంతా కూర్చొని మందు తాగటం, అసభ్యకర మాటలు మాట్లాడుకోవటం లాంటి ఎన్నో సన్నివేశాలు ఈ టీజర్‌లో చూపించారు. ఈ టీజర్ అంతా డబుల్ మీనింగ్ డైలాగులతోను.. శృతి మించిన గ్లామర్ తోనూ.. లిప్ టు లిప్ కిస్ లతోను నింపేశారు.
‘‘రేయ్.. నేను బిగ్‌బాస్‌నే చూసినదాన్నిరా’’ అంటూ ఓవియా చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం రక్తి కట్టించే సన్నివేశాలతో యూత్‌ని ఆకట్టుకుంటూ వేగంగా వ్యూస్ రాబడుతోంది. కాగా ఈ టీజర్‌ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓవియా.. ఈ అడల్ట్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొంది.