కలల్లోంచి కలల్లోకి ప్రయాణించాలనుకుంటే ఇది చూడాలి!
అరడజను పైగా ఆస్కార్ లు గెలుచుకున్న అద్భుతమైన హాలీవుడ్ సినిమా `ఇన్ సెప్షన్`. జీవితంలో ప్రతి సినీమేధావి ఒక 100 సార్లు అయినా చూసి తీరాల్సిన సినిమా ఇది. కలల్లోంచి కలల్లోకి వెళ్లడం అక్కడ వేరొకరి కలల్ని దొంగిలించడం .. ఒకసారి కలలోకి వెళ్లాక అక్కడి నుంచి మళ్లీ మళ్లీ కలల లోతుల్లోకి వెళ్లడం.. అక్కడ వేరొకరి రహస్యాల్ని కనుక్కోవడం.. ఇదంతా ఒక మాయ లాగా చూపించాడు క్రిస్టోఫర్ నోలాన్. కలల్లోకి వెళ్లి అది కల అనుకుని నిజంలోకి వచ్చాక చనిపోయిన భార్య కోసం భర్త కలల్లోకి వెళ్లి తిరిగి తన జీవితాన్ని ఆస్వాధించడం అనే గొప్ప ఐడియాని సబ్ ఫ్లాట్ లో ప్రవేశ పెట్టి సెంటిమెంటును కూడా కలిపాడు నోలాన్. అతడి ఆలోచనే ఒక వింత. ఒక మహదాద్భుతం అంటే అతిశయోక్తి కానే కాదు.
దర్శకుడి ఊహను విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ అంత సమర్థవంతంగా మహదాద్భుతంగా తెరపై ఆవిష్కరించడం అన్నది వరల్డ్ సినిమా హిస్టరీలో వేరొకటి లేనే లేదు. ఇకపై అయినా మళ్లీ ఇలాంటి సినిమాని నోలాన్ అయినా క్రియేట్ చేస్తాడా? అంటే సందేహమే. టైటానిక్ హీరో డికా ప్రియో అద్భుత నటనతో రంజింపజేసిన సినిమా కూడా ఇది.
బహుశా ఇలాంటి వండర్ ఒక్కసారే పుడుతుంది. దీనికి సీక్వెల్ తీసినా అంతగా తీయగలడా? క‌్రిస్టోఫర్ నోలాన్..? అన్న చిక్కు ప్రశ్న ఈ సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే సినీప్రియులంతా దేవుడి గదిలో దేవుళ్ల ఫోటోలు పెట్టుకోవడం అనవసరం .. నోలాన్ ఫోటో పెట్టుకుని తీరాలి అంటే తప్పేమీ కాదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. క్వారంటైన్ టైమ్ ని ఆస్వాధించాలన్నా.. ఎవరైనా మిస్సయిన వాళ్లు ఉంటే చూసి ఆస్వాధించే ఛాన్స్ ఉంది. సంచలనాల `ఇన్ సెప్షన్` రిలీజై సరిగ్గా నేటికి 10 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్లు ఆస్వాధిస్తోంది నోలాన్ టీమ్. ఆగస్టులో స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట.